ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు పటిష్టం..!

జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

కడప, జూలై 31 : ఆగస్టు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా.. అన్ని రకాలుగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.ఏఎస్ఎల్ (Advanced security liaison) నిర్వహణలో భాగంగా  జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ లతో కలిసి.. జమ్మలమడుగు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. 
1000430504
ముందుగా కడప విమానాశ్రయంతో పాటు జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం గ్రామపంచాయతీ సమీపంలో ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను, అనంతరం గూడెం చెరువు గ్రామాన్ని చేరుకుని, అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభ నిర్వహించే ప్రాంతాల్లో ఏర్పాట్లను అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సభాస్థలి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ నిబంధనల మేరకు పాటించాల్సిన నియమాలపై అధికారులకు సూచనలు, సలహాలు జారీచేశారు. అనంతరం సాయంత్రం.. ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించే నానుబాల యల్లప్ప ఫంక్షన్ హాలులో.. భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.
1000430452
అనంతరం ఎఎస్ఎల్ లో భాగంగా.. గండికోట పర్యాటక క్షేత్రాన్ని చేరుకుని.. అక్కడి హెలిప్యాడ్ ను, ముఖ్యమంత్రి పాల్గొనే ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించి... ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా వుండాలని, అలాగే త్రాగు నీటి కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కడప ఎయిర్ పోర్టు నుండి ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గం వెంట ప్రోటోకాల్ మేరకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 
 
ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు, బద్వేలు, కడప ఆర్డిఓలు సాయిశ్రీ, చంద్రమోహన్, జాన్ ఇర్విన్, స్థానిక యువ నాయకులు భూపేష్ రెడ్డి, సీఎం సెక్యూరిటీ అధికారులు, విద్యుత్, ఆర్ అండ్ బి, పీఆర్ శాఖల ఇంజనీర్లు, రెవెన్యూ, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 

About The Author