అక్రమ ఇసుక నిల్వలపై కొరడా జులిపించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 11: నిర్మల్ పట్టణంలొ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల స్వయంగా అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై ఆకస్మికంగా గాజుల్ పెట్, రాంనగర్, మంజులపూర్ ప్రాంతాల్లో తిరిగి సీజ్ చేయటం జరిగింది. ఇట్టి తనిఖీల్లో ఎస్పి తో పాటు నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, అర్బన్ తహసిల్దార్ రాజు, పోలీస్ మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ టీం, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ లను ఏర్పాటు చేశామని, అనుమతులు లేకుండా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలనుండి ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో విశ్వసనీయమైన సమాచారంతో 17 ఇసుక రీచ్ లు మరియు 35 ఇసుక నిల్వలను ఉన్నాయని సమాచారం ఉంది అని తెలియజేసారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఇట్టి అక్రమ నిల్వలపై సూచనలు ఇవ్వటం జరిగింది. జిల్లాలోని గోదావరి, స్వర్ణ వాగు, శుద్ధ వాగు , పరిసర ప్రాంతాల్లో నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలిసింది కాబట్టి అట్టి ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించే పోలీస్ సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇసుక అక్రమ నిల్వలు టానికి చేసి రెవిన్యూ అధికారుల సహకారంతో సీజ్ చేయాలని తెలియజేసారు. ఇసుక రీచ్ లనుండి ఎవరు అనుమతులు లేకుండా ఇసుక తరలించకుండ చూడాలన్నారు.ఈ ఆన్లైన్ మీటింగ్ లో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ఇసుక నిల్వలపై కొరడా జులిపించిన జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల.

భారత శక్తి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 11: నిర్మల్ పట్టణంలొ జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల స్వయంగా అక్రమంగా ఉంచిన ఇసుక నిల్వలపై ఆకస్మికంగా గాజుల్ పెట్, రాంనగర్, మంజులపూర్ ప్రాంతాల్లో తిరిగి సీజ్ చేయటం జరిగింది. ఇట్టి తనిఖీల్లో ఎస్పి తో పాటు నిర్మల్ ఏఎస్పి రాజేష్ మీనా, పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్, అర్బన్ తహసిల్దార్ రాజు, పోలీస్ మరియు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలించిన, నిల్వ ఉంచిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక పోలీస్ టీం, స్పెషల్ టాస్క్ ఫోర్సెస్ లను ఏర్పాటు చేశామని, అనుమతులు లేకుండా జిల్లాలో వేర్వేరు ప్రాంతాలనుండి ఇసుక తరలించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో విశ్వసనీయమైన సమాచారంతో 17 ఇసుక రీచ్ లు మరియు 35 ఇసుక నిల్వలను ఉన్నాయని సమాచారం ఉంది అని తెలియజేసారు.
జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో ఆన్లైన్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరికీ ఇట్టి అక్రమ నిల్వలపై సూచనలు ఇవ్వటం జరిగింది. జిల్లాలోని గోదావరి, స్వర్ణ వాగు, శుద్ధ వాగు , పరిసర ప్రాంతాల్లో నుండి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని తెలిసింది కాబట్టి అట్టి ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించే పోలీస్ సిబ్బంది కి తగిన సూచనలు చేశారు. అన్ని ప్రాంతాల్లో తిరిగి ఇసుక అక్రమ నిల్వలు టానికి చేసి రెవిన్యూ అధికారుల సహకారంతో సీజ్ చేయాలని తెలియజేసారు. ఇసుక రీచ్ లనుండి ఎవరు అనుమతులు లేకుండా ఇసుక తరలించకుండ చూడాలన్నారు.ఈ ఆన్లైన్ మీటింగ్ లో భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, నిర్మల్ ఏఎస్పీ రాజేష్ మీనా, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, అన్ని పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts