లింగ నిర్దారణ చట్ట రీత్యా నేరం:జిల్లా జడ్జి లక్ష్మి శారద
సూర్యాపేట జిల్లా బ్యూరో (భారత శక్తి) జూలై 23: లింగ నిర్దారణ చేయటం చట్ట రీత్యా నేరమని అది ఎవరు చేసినా ఎవరు సహకరించినా చట్టరీత్యా తీవ్ర పరిణామాలకి గురి కావాల్సి వస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆధారిటి కమిటీలో జిల్లా జడ్జి లక్ష్మి శారద, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పి సి పి ఎన్ డి టి చట్టం, క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ల ప్రకారం అర్హత లేని వారు హాస్పిటల్స్, డయాగ్నస్టిక్ సెంటర్ లు నిర్వహించరాదని ఆదేశించారు.
వైద్య అధికారులు తనిఖీ లు చేసినప్పుడు అర్హత లేని వారు నిర్వహిస్తే ఆ సెంటర్ అనుమతి రద్దు చేయాలని అలాగే ఎక్విప్మెంట్ సీజ్ చేయాలని సూచించారు. జిల్లాలో 44 స్కాన్ సెంటర్ లు పని చేస్తున్నాయని, అర్హత లేకుండా నిర్వహిస్తున్న మూడు స్కాన్ సెంటర్ లను సీజ్ చేయటం జరిగిందని వారిని చట్టం ప్రకారం కోర్ట్ కి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ప్రకారం బిల్డింగ్ అనుమతులు, ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు ఉన్న వాటికే హాస్పిటల్ కి అనుమతి ఇవ్వాలని, ధరల పట్టిక ప్రతి హాస్పిటల్ లో అలాగే డయాగ్నస్టిక్ కేంద్రాలలో ప్రదర్శించాలని సూచించారు.
ప్రెవేట్ హాస్పిటల్ లో జన్మించిన వివరాలు హెచ్ ఎం ఐ ఎస్ పోర్టల్ లో ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని సూచించారు. జిల్లా జడ్జి లక్ష్మి శారద మాట్లాడుతూ గర్భస్రావం చేస్తున్నా హాస్పిటల్స్ లను, లింగ నిర్దారణ చేస్తున్నా స్కానింగ్ సెంటర్ లను అధికారులు గుర్తించి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని పి సి పి ఎన్ డి టి యాక్ట్ పై ప్రజలకి లీగల్ అవెర్నెస్ కల్పిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, డి ఎం హెచ్ ఓ పి చంద్రశేఖర్, డిప్యుటీ డి ఎం హెచ్ ఓ జి, పి ఓ డి ఆర్ ఎ చంద్రశేఖర్, పి ఓ పి సి పి ఎన్ డి టి నాజియా, ఐ ఎం ఎ మెంబర్ ఆనంద్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.