మలేరియా, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి..
ములుగు జిల్లా ప్రతినిధి, జులై 29 (భారత శక్తి) : వర్షాకాలంలో వచ్చే మలేరియా, డెంగ్యూ వ్యాధుల నియంత్రణ పట్ల ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర్టి టి.ఎస్. వైద్యాధికారులను ఆదేశించారు.
మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మిక తనిఖీ చేశారు.
మంగళవారం వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ వార్డును సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులకు వైద్యాధికారులు అందిస్తున్న సేవలు, ఏ విధంగా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించి అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అవుట్ పేషంట్ వైద్య సేవలకు రోజుకు ఎంతమంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని, డ్రగ్స్టోర్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, లేనియెడల జిల్లా కార్యాలయానికి ఇండెంట్ పెట్టి సమకూర్చుకోవాలని ఫార్మాసిస్టుకు సూచించారు. ఆరోగ్య కేంద్రంలో మానవ వనరుల కొరత ఏమైనా ఉన్నాయా అని డాక్టర్ను అడిగి తెలుసుకోనగా,ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీగా ఉందని తెలిపారు. త్వరలోనే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టును భర్తీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంవైద్యాధికారులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ రిషిత ఆయుష్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పాషా, పి హెచ్ ఎన్ శోభ హెల్త్ సూపర్వైజర్ పుష్పకుమారి, ఫార్మసి ఆఫీసర్ రాజమణి, స్టాఫ్ నర్స్ మునెమ్మ రజిత, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025