విద్యకు అత్యధిక ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా,జనవరి 30(భారత శక్తి ): రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అన్నారు. సింహాద్రిపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి,జిల్లా టిడిపి అధ్యక్షులు,పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, ఇతర టిడిపి నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 మోడల్ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్) కు ప్రతిరూపంగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచిందన్నారు. ప్రభుత్వం, ప్రవేటు, దాతలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో అద్భుతమైన స్కూలును నిర్మించారన్నారు. అలాగే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చి ప్రక్షాళన చేస్తూ ప్రపంచంలోనే అన్ని రంగాల్లో పోటీపడే విధంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలు ఉపయోగం లోకి తీసుకొచ్చిన దాతలు, గ్రామస్తులకు,నేతలకు హృదయ పూర్వక కృత్ఞతలు తెలిపారు.నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్ లోనే చదివానని ఈ స్కూల్ చూడగానే మా గుర్తుకు వచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయి స్కూల్లకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలను నిర్మచడం గొప్ప అంశమన్నారు. విద్యకు ప్రభుత్వ ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందన్నారు. ఒక మంచి ఆలోచనతో ఏమైనా సాధించవచ్చు అని దానికి నిదర్శనంగా ఈ స్కూలు నిలిచిందన్నారు. ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థి సంవత్సరానికి 35వేలు ఫీజు కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి పై సంవత్సరానికి దాదాపు 76వేలు రెట్టింపు ఖర్చు పెడుతోందని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తోందని అన్నారు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు, మంచి విద్యతోపాటు ఆరోగ్యాన్ని అందించడానికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి అర్హత గల టీచర్లు ఉన్నారని పిల్లలకు విద్య తో పాటు ఆటలు, టెక్నాలజీ,అంశాలను కూడా నేర్పించాలని కోరారు. నాకు చదువు నేర్పించి రామానుజాచార్యులు టీచర్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థులకు మంచి నడవడిక క్రమశిక్షణ కళలు వంటి నైపుణ్యాలను నేర్పించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ గ్రామం నుంచి ఉన్నత స్థానాలు అలంకరించిన వారు కొంత సమయాన్ని కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ వేసవి కాలంలోపే సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మార్చాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చిన నందుకు కృతజ్ఞాలు తెలిపారు.మా నాన్నగారు బంధువులు ఇక్కడే చదివారన్నారు. ఈ పాఠశాలతో మా కుటుంబానికి ఎంతో ఆప్యాయతలు ముడిపడి ఉన్నాయని అన్నారు. పాఠశాల ముందు లారీలు కూడా రాలేని రోడ్లు వుంటే వాటిని ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్కూలుకు కావలసిన ఫర్నిచర్ అడిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కల్పించారన్నారు. చదువులతో పాటు విద్యార్థులు ఆటలు మీద దృష్టి కేటాయించాలన్నారు.చిన్న దేశాలు ఒలంపిక్ పథకాలు గెలుస్తున్నాయని వాటికి దీటుగా మనం కూడా పథకాలు సాధించాలన్నారు. మండలంలో చీని పంటలకు వ్యాధులు సోకి రైతులు నష్టపోతున్నారని శాస్త్రజ్ఞుల బృందంతో పరిశోధన చేయించాలని కోరారు. అలాగే శనగ రైతులు పంటలు నష్టపోయారని క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు.గత ప్రభుత్వంలో అసంపూర్తి గా మిగిలిన పనులను పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అత్యద్భుతంగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్మించారన్నారు. ఓ వైపు సరస్వతి దేవి,మరోవైపు వివేకానంద స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చదువుకోవాలనే స్ఫూర్తిని నింపుతున్నాయన్నారు. గతంలో ఆగిపోయిన పాఠశాలను జిల్లా కలెక్టర్ కు విన్నవించి పూర్తిచేసిన నాయకులకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. 93 సం క్రితం ఏర్పాటైన పాఠశాలకు చాల చరిత్ర వుందని అన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అంతకు ముందు సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం లో భాగంగా పాఠశాల మీటింగ్ హాలు, ఆఫీస్ రూము, అత్యాధునిక వసతులతో కలిగిన లాంగ్వేజ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ,కిచెన్ గదులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జోగి రెడ్డి, రఘునాథరెడ్డి, పులివెందుల ఆర్డిఓ చెన్నయ్య,డీఈవో శంషుద్దీన్,డిప్యూటీ డిఈవో మీనాక్షి,సమగ్ర శిక్ష అధికారి అధికారి నిత్యానంద రెడ్డి,సింహాద్రిపురం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే ఉమామహేశ్వరి , పూర్వ విద్యార్థులు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

విద్యకు అత్యధిక ప్రాధాన్యత: జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి

వైయస్సార్ జిల్లా,జనవరి 30(భారత శక్తి ): రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అన్నారు.

సింహాద్రిపురం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి,జిల్లా టిడిపి అధ్యక్షులు,పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, ఇతర టిడిపి నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు P4 మోడల్ (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్) కు ప్రతిరూపంగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిలిచిందన్నారు. ప్రభుత్వం, ప్రవేటు, దాతలు, గ్రామ పెద్దలు అందరి సహకారంతో అద్భుతమైన స్కూలును నిర్మించారన్నారు. అలాగే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వచ్చి ప్రక్షాళన చేస్తూ ప్రపంచంలోనే అన్ని రంగాల్లో పోటీపడే విధంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తోందని తెలిపారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనాలు ఉపయోగం లోకి తీసుకొచ్చిన దాతలు, గ్రామస్తులకు,నేతలకు హృదయ పూర్వక కృత్ఞతలు తెలిపారు.నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్ లోనే చదివానని ఈ స్కూల్ చూడగానే మా గుర్తుకు వచ్చిందన్నారు. కార్పొరేట్ స్థాయి స్కూల్లకు ఏమాత్రం తీసుకోకుండా ప్రభుత్వ పాఠశాలను నిర్మచడం గొప్ప అంశమన్నారు. విద్యకు ప్రభుత్వ ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా వుందన్నారు. ఒక మంచి ఆలోచనతో ఏమైనా సాధించవచ్చు అని దానికి నిదర్శనంగా ఈ స్కూలు నిలిచిందన్నారు. ప్రైవేటు స్కూల్లో చదివే విద్యార్థి సంవత్సరానికి 35వేలు ఫీజు కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి పై సంవత్సరానికి దాదాపు 76వేలు రెట్టింపు ఖర్చు పెడుతోందని తెలిపారు. విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కల్పిస్తోందని అన్నారు.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు, మంచి విద్యతోపాటు ఆరోగ్యాన్ని అందించడానికి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి అర్హత గల టీచర్లు ఉన్నారని పిల్లలకు విద్య తో పాటు ఆటలు, టెక్నాలజీ,అంశాలను కూడా నేర్పించాలని కోరారు. నాకు చదువు నేర్పించి రామానుజాచార్యులు టీచర్ వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానన్నారు. విద్యార్థులకు మంచి నడవడిక క్రమశిక్షణ కళలు వంటి నైపుణ్యాలను నేర్పించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ గ్రామం నుంచి ఉన్నత స్థానాలు అలంకరించిన వారు కొంత సమయాన్ని కేటాయించి గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు.

పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి మాట్లాడుతూ వేసవి కాలంలోపే సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మార్చాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ వచ్చిన నందుకు కృతజ్ఞాలు తెలిపారు.మా నాన్నగారు బంధువులు ఇక్కడే చదివారన్నారు. ఈ పాఠశాలతో మా కుటుంబానికి ఎంతో ఆప్యాయతలు ముడిపడి ఉన్నాయని అన్నారు. పాఠశాల ముందు లారీలు కూడా రాలేని రోడ్లు వుంటే వాటిని ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద పూర్తి చేయడం జరిగిందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని మంచి పేరు తీసుకురావాలని కోరారు. స్కూలుకు కావలసిన ఫర్నిచర్ అడిగిన వెంటనే జిల్లా కలెక్టర్ కల్పించారన్నారు. చదువులతో పాటు విద్యార్థులు ఆటలు మీద దృష్టి కేటాయించాలన్నారు.చిన్న దేశాలు ఒలంపిక్ పథకాలు గెలుస్తున్నాయని వాటికి దీటుగా మనం కూడా పథకాలు సాధించాలన్నారు. మండలంలో చీని పంటలకు వ్యాధులు సోకి రైతులు నష్టపోతున్నారని శాస్త్రజ్ఞుల బృందంతో పరిశోధన చేయించాలని కోరారు. అలాగే శనగ రైతులు పంటలు నష్టపోయారని క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ను కోరారు.గత ప్రభుత్వంలో అసంపూర్తి గా మిగిలిన పనులను పూర్తి చేస్తున్నామన్నారు.

జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ అత్యద్భుతంగా సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిర్మించారన్నారు. ఓ వైపు సరస్వతి దేవి,మరోవైపు వివేకానంద స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో చదువుకోవాలనే స్ఫూర్తిని నింపుతున్నాయన్నారు. గతంలో ఆగిపోయిన పాఠశాలను జిల్లా కలెక్టర్ కు విన్నవించి పూర్తిచేసిన నాయకులకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు. 93 సం క్రితం ఏర్పాటైన పాఠశాలకు చాల చరిత్ర వుందని అన్నారు. విద్యార్థులు బాగా చదివి తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

అంతకు ముందు సింహాద్రిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవం లో భాగంగా పాఠశాల మీటింగ్ హాలు, ఆఫీస్ రూము, అత్యాధునిక వసతులతో కలిగిన లాంగ్వేజ్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ ,కిచెన్ గదులను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జోగి రెడ్డి, రఘునాథరెడ్డి, పులివెందుల ఆర్డిఓ చెన్నయ్య,డీఈవో శంషుద్దీన్,డిప్యూటీ డిఈవో మీనాక్షి,సమగ్ర శిక్ష అధికారి అధికారి నిత్యానంద రెడ్డి,సింహాద్రిపురం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే ఉమామహేశ్వరి , పూర్వ విద్యార్థులు, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related Posts