క్యాసారం బీరప్పల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..

క్యాసారం బీరప్పల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్..

పటాన్‌చెరు:

గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని క్యాసారం గ్రామంలో సోమవారం నిర్వహించిన బీరప్పల జాతరలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కృష్ణ యాదవ్, ప్రభాకర్, ఈశ్వర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.WhatsApp Image 2026-05-18 at 19.06.58 (1)

About The Author