సమాజ సేవలో యువకులు ముందుకు రావాలి..
మల్కాజిగిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆలంపల్లి సురేష్
మల్కాజిగిరి:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామ సూదిని పద్మా రెడ్డి, తెలంగాణ గ్రామపంచాయతీ ట్రైబ్యునల్ చైర్మన్ సూదిని రాం రెడ్డి మల్కాజిగిరి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఆలంపల్లి సురేష్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం మల్కాజ్ గిరి లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో లో నిర్వహించారు. సంఘ సభ్యులు, ప్రముఖులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదిని రామ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి అలంపల్లి సురేష్ మరింత కృషి చేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సూదిని పద్మారెడ్డి మాట్లాడుతూ సమాజ సేవలో యువ నాయకత్వం ఎంతో అవసరమని, మల్కాజిగిరి ఆర్యవైశ్య సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అలంపల్లి సురేష్ ని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
About The Author
19 May 2026
