నేటి భారతం
ఇంద్రపల్లి గోవర్ధన్ విరచితం..
మాటకు మాట సమాధానం చెప్పడం ఎవరైనా చేస్తారు..
కానీ చాలా మంది మౌనంగా ఉంటారు..
ఎందుకో తెలుసా..? బంధాల విలువ ఏమిటో
వారికి తెలుసు కనుక..
నిజానికి ఎదుటివారికి బంధాల విలువ తెలియనప్పుడు
ఇక మాటల విలువలు ఏమి తెలుస్తాయి..?
అందుకే మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటారు..
కానీ కొందరు ఎదుటివారి మౌనాన్ని చేతకాని తనంగా
అనుకుంటూ ఉంటారు.. వారికి తెలియనిది ఏమిటంటే
ఒక్కసారి మౌనం బద్దలైందంటే.. లక్ష అణుబాంబులు
పేలినంత కంటే ఎక్కువుగా ప్రభావాన్ని చూపుతుందని..
సో ఎప్పటికీ మౌనాన్ని తక్కువుగా అంచనా వేయకండి..
- ఇంద్రపల్లి గోవర్ధన్..
About The Author
02 Aug 2025