నేటి భారతం :

తప్పు చేయాలి అనుకున్న వారు దేనినీ లెక్కచేయరు..
చట్టం, న్యాయం, నిబంధనలు అన్న పదాలు వీరి నిఘంటువులో ఉండవు..
అక్రమంగా సంపాదించించడం.. జీవితాన్ని ఎంజాయ్ చెయ్యడం..
ఎదుటివారు ఏమైనా వీరికి సంబంధం ఉండదు..
సమాజం నాశనం అయినా వీరికి పట్టింపు ఉండదు..
తనవారు అనే భావన కూడా ఉండదు..
ఎందుకంటే దేవుడు ఉన్నాడు అనే విషయం కూడా వీరు గుర్తుపెట్టుకోరు..
అందుకే పాప పుణ్యాలు, స్వర్గం, నరకం, మోక్షం, లాంటివి వీరు నమ్మరు..
పోతే పోతాం.. ఉంటే ఉంటాం.. బ్రతికినన్నాళ్ళు ఖుషీగా బ్రతికేద్దాం..
ఇదే వీరి ఎజెండాగా ఉంటుంది..
దైవాన్ని నమ్మని వాళ్లకి పాపభీతి కూడా ఉండదు..
కానీ వీరికి తెలియని విషయం ఏమిటంటే నరకం అనేది ఎక్కడో ఉండదు..
వీళ్ళు చేసిన పాపాలకు ఇక్కడే అనుభవిస్తారు..
అదే దైవం అంటే.. ఈ నిజం గ్రహించాలి..
About The Author
14 Apr 2026
