నేటి భారతం..

ఐదేళ్లకొకసారి బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, ఒక్క వెయ్యి రూపాయలు..
నీ మొహాన పడేస్తాడు.. నీ ఓటును కొనేస్తాడు..
అదే మహా ప్రసాదం అని భావిస్తావు నువ్వు నీ ఓటును ఒక దుర్మార్గుడికి అమ్ముకుంటావు..
నీ ఐదేళ్ల జీవితమే కాదు.. మీ పిల్లల వందేళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేస్తావు..
ఓటేసేముందు ఒక్కసారి ఆలోచించు..
ఓటు అనేది నీకు లైసెన్సు లేని ఆయుధం..
ఆ ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకో..
నీకు సేవ చేసే నాయకున్ని గుర్తించి ఎన్నుకో...
నువ్వు గుడ్డిగా ఓటేస్తావు..
వాడికి పదవి వస్తుంది సంపద వస్తుంది..
నీకు మాత్రం కష్టాలు కన్నీళ్లు మాత్రమే మిగులుతాయి..
ఈ వాస్తవాన్ని అర్థం చేసుకో నీ జీవితాన్ని అర్థవంతం చేసుకో...
About The Author
06 Dec 2025
