ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి..
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి :
సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం ఎండార్స్మెంట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 41 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజావాణికి వచ్చిన 41 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని, అవసరమైతే ఫీల్డ్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డిఓ రవి అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
