ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి13: జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు రెండు బాక్స్లను సిద్ధం చేయాలి. ప్రతి రూట్ కు రెండు బస్సులను ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సీసీ టీవీలు తదితర సౌకర్యాలను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేసే విధంగా నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో పాటు ర్యాలీలను, సభలను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, నోడల్ అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంబంధించిన ఇతర అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నోడల్ అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఇతర నోడల్ అధికారులతో పాటు తహసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేయాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య

హనుమకొండ ప్రతినిధి(భారత శక్తి)ఫిబ్రవరి13:
జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పై నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు రెండు బాక్స్లను సిద్ధం చేయాలి. ప్రతి రూట్ కు రెండు బస్సులను ఉండే విధంగా చూడాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, సీసీ టీవీలు తదితర సౌకర్యాలను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తిచేసే విధంగా నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంతో పాటు ర్యాలీలను, సభలను వీడియో చిత్రీకరణ చేయాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణ, నోడల్ అధికారుల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంబంధించిన ఇతర అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి నోడల్ అధికారులకు వివరించారు.
ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, జిల్లా ఖజానా శాఖ అధికారి శ్రీనివాస్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, ఇతర నోడల్ అధికారులతో పాటు తహసిల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

About The Author