ఆర్థిక మద్దతు పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7821.19 కోట్ల రుణాలు మంజూరు
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

బుధవారం కలెక్టరేట్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు , జిల్లా అధికారులతో రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జి.పి.వై. రుణాలు, ఎస్సీ, బిసి, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతి పై డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. వివిధ ఆర్థిక మద్దతు పథకాలకు సంబంధించి వంద శాతం లక్ష్యసాధనకు బ్యాంకర్లు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
రైతులు తమ రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం పై వారికి అవగాహన కల్పించాలని, జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బ్యాంకర్లు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2025 నుండి సెప్టెంబర్ 2025 నెల వరకు రూ. 7821.19 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు గాను రూ. 3239.73 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ. 1761.41 కోట్లు, విద్యా రుణాలకు రూ. 9.70 కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ. 99.89 కోట్లు మహిళా సంఘాలకు రూ.614.36 కోట్లు, ఇతర రంగాలకు సంబంధించి రూ.2096.10 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన రైతులు అందరికీ రుణాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో 30.09.2025 వరకు 58.22 శాతం పూర్తయిందని, పెండింగ్ లో ఉన్న రుణాల ప్రతిపాదనలు సైతం బ్యాంకర్లు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాలలో రుణాలు మంజూరి అయిన లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించేలా ఆయా శాఖల అధికారులు జిల్లాలో రుణాల రికవరీ పై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో ప్రధానమంత్రి స్వానిది కింద మొదటి, రెండవ, మూడవసారి రుణం దరఖాస్తు చేసుకున్న వారి పెండింగ్ దరఖాస్తులను, పీఎంఈజీపి పీఎం విశ్వకర్మ యోజన పథకాలకు సంబంధించి దరఖాస్తులను సత్వరం క్లియర్ చేసి పరిష్కరించాలని బ్యాంకర్లకి సూచించారు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా 01.10. 2025 నుండి 31.12.2025 వరకు "మీ డబ్బు మీ హక్కు" అనే శీర్షికతో ఆర్థిక రంగంలో క్లైమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం జిల్లా స్థాయి ప్రచారం జరుగుతున్నదని తెలియచేసారు. పౌరులు తమ క్లైమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, డివిడెంట్లు మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు మొదలైన వాటిని క్లైమ్ చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. క్లైమ్ చేయని ఆర్థిక ఆస్తులకు హక్కుదారులు అవసరమైన పత్రాలతో తమ బ్యాంకులను, ఇతర సంస్థలను సంప్రదించి నిధులను తిరిగి పొందాలని,ఈ ప్రచారాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ యొక్క వివరాలను తెలుసుకోవటానికి గూగుల్లో (యు డి జి ఏ ఎం) పోర్టల్ లో మీ పేరు రిజిస్టర్ చేసుకొని మీ వివరాలతో మీయొక్క ఎకౌంటు ఉన్నదో లేదో కూడా చూసుకోవచ్చు అని వివరించారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీ పాత ఖాతాలో మరిచిపోయిన అమౌంట్లను మీరు తీసుకోవచ్చు అని సూచించారు. జీరో బ్యాలెన్స్ ఖాతాలు, ఇతర పొదుపు బ్యాంకు ఖాతాలు కలిగిన వారి ఖాతాలు ని ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలు బ్యాంకు వాళ్ళకు యిచ్చి రి కే వై సి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎల్డిఎం ఆంజనేయులు జెడ్పి సీఈవో శ్రీనివాస్, డిఆర్డిఓ శ్రీధర్, ఆర్.బి.ఐ అధికారి శ్రీనివాస్ నాబార్డ్ డిడిఎం జయే ప్రకాష్ ఎస్బిఐ ఏజీఎం వెంకటేష్ టీజీబీ ఆర్ ఎం బాల నాగు, కెడీసీసీబీ సీఈవో, అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్స్, డిఎఓ , జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎమ్ , డిడబ్ల్యూఓ సరస్వతి పిడి మెప్మా సునీత, తదితరులు పాల్గొన్నారు.
