గీతంలో రక్తదాన శిబిరం

- ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహణ
- 140 మంది రక్తదానం

WhatsApp Image 2025-12-31 at 6.37.15 PM

సంగారెడ్డి : 

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం (31-12-2025న) రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధ్యాపక, విద్యార్థి సమన్వయకర్తలతో కలిసి, గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 140 మంది విద్యార్థి స్వచ్ఛంద సేవకులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని, రక్తదానం చేశారు. దాతలకు ఎన్టీఆర్ ట్రస్టు ప్రశంసా పత్రాలను ప్రదానం చేయడంతో పాటు రిఫ్రెష్ మెంట్లను కూడా అందజేసింది.ఇటువంటి నిస్వార్థ చర్యలు ప్రాణాలను కాపాడటమే కాకుండా ఇతరులు ముందుకొచ్చి సమాజ హితానికి దోహదపడేలా ప్రేరేపిస్తాయని నిర్వాహకులు విద్యార్థుల దాతృత్వాన్ని ప్రశంసించారు. రక్తదానం నిజంగా ప్రాణదానం వంటిదని, ఇది వ్యక్తులను, సమాజాన్ని బలోపేతం చేసే ఒక నిస్వార్థమైన చర్యగా వారు అభివర్ణించారు.

About The Author