విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు క్యాష్ రివార్డు
ఖమ్మం: ఉత్సాహంతో పనిచేసే పోలీస్ సిబ్బందిని మరింత ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఇటీవల జిల్లాలో గంజాయి వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణలో కష్టపడి పనిచేసిన టాస్క్ ఫోర్స్ పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఎస్ కె. ఖాసీంఅలీ, కానిస్టేబుల్ వి.గోపి, యం.సతీష్ లను పోలీస్ కమిషనర్ అభినందించి, క్యాష్ రివార్డు అందజేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... 33 గంజాయి కేసుల్లో 120 మంది నిందుతులను అరెస్ట్ చేయడంలో,192 కేజీల గంజాయి పట్టుకోవడంలో ఈ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ.. సమాజ రక్షణ కోసం అంకితభావంతో భాద్యతలు నిర్వహిస్తూ మెరుగైన సేవలు అందించాలని తెలిపారు.
కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.
About The Author
05 Aug 2025