ముఖ గుర్తింపు హాజరు నమోదు శాతం పెంచాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాళ్లు, మండల విద్యాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు మోడల్ స్కూళ్లలో ముఖ గుర్తింపుతోపాటు విద్యార్థుల హాజరు 85 శాతానికి తగ్గకుండా ఉండాలని, క్రమం తప్పకుండా బడికి వచ్చేలా చూడాలని అన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో విద్యార్థుల హాజరు శాతాన్ని తెలియజేయాలని, రోజు పిల్లల్ని పంపించే విధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్లో కల్పించిన అన్ని సౌకర్యాలు వినియోగంలో ఉండాలని, నిరుపయోగంగా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయాలని ఆదేశించారు.
