కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష..

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కార్యక్రమం..

 

కోదాడ,హుజూర్ నగర్ నియోజక వర్గాలను దేశంలోనే ఆదర్శ నియోజక వర్గాలుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.
ఎత్తిపోతల పథకాలపై ముగిసిన సమీక్ష.లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలలో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రశ్న లేదు
నిర్దేశించిన సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి చేయాలి
లిఫ్ట్ ఇరిగేషన్ ల భూ సేకరణకు అందరూ సహకరించాలి
లిఫ్టుల నిర్వహణలో రైతులు భాగస్వాములు కావాలి
చెరువులలో ఆక్రమణలు తొలగించి ఎఫ్ టి ఎల్ వరకు పటిష్టం చేయాలని అధికారులకు ఆదేశం
గత ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్లను నిర్లక్ష్యం చేసింది
రెండు నియోజక వర్గాలలో పాత లిఫ్టుల,కాలువలు నిర్మాణం చేపట్టండి.
లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల భూసేకరణ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నాం జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్
హుజూర్ నగర్,కోదాడ లలో ఆగస్టు 15 న  మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన 
కోదాడలో 9 కోట్ల 44 లక్షలు,హుజూర్ నగర్ లో 2కోట్ల 2 లక్షల రూపాయల వ్యయంతో మోడరన్ బస్ స్టేషన్ల నిర్మాణం
యంగ్ ఇండియా రెసిడెన్సియల్ పాఠశాలలు నిర్మించనున్నగడ్డిపల్లి, చిలుకూరు రోడ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలి
కోదాడ,హుజూర్ నగర్ 2 నియోజక వర్గాలలో ఆర్ అండ్ బి రోడ్లు,బ్రిడ్జ్ లు, కమ్యూనిటీ హాల్స్,గెస్ట్ హౌస్ ల పై సమీక్షించిన మంత్రి
రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి- పద్మావతి

 

హైదరాబాద్:  కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాలలో పలు అభివృద్ధి పనులపై అధికారులతో హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఆడిటోరియం నందు కోదాడ శాసన సభ్యురాలు యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ లతో కలిసి రాష్ట్ర నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రెడ్లకుంట లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 4460 ఎకరాలకు 47.64 కోట్ల రూపాయలతో పాలేరు వాగు పై నిర్మించటం జరుగుతుందని తెలిపారు.రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ఇరిగేషన్ ని 54.03 కోట్ల రూపాయలతో 5000 ఎకరాలకి పాలేరు వాగు ద్వారా అందించటం జరుగుతుందన్నారు. ఆర్9 లిప్ట్ ఇరిగేషన్ మునగాల, నడిగూడెం మండలాలకి చెందిన 3500 ఎకరాలకి 8.45 కోట్లతో నిర్మించటం జరుగుతుందన్నారు.మోతే లిప్ట్ ఇరిగేషన్ ని 244 కోట్ల రూపాయలతో 45,736 ఎకరాలకి  4.5 టి ఎం సి ల నీరు సరఫరా చేయటం జరుగుతుందని తెలిపారు.పులిచింతల వెనుక జలాలు ని ఉపయోగించుకొని ముక్ట్యాల బ్రాంచ్ కెనాల్  లిప్ట్ ఇరిగేషన్ స్కీం మఠంపల్లి మేళ్లచెరువు చింతలపాలెం మండలాల్లో 1450 కోట్ల రూపాయలతో 53000 ఎకరాలకి నీరు అందించటం జరుగుతుందని ఇప్పటికే 188.32 ఎకరాలకి భూ సేకరణ చేసి నష్ట పరిహారం అందించటం జరిగిందని జూలై 2026 నాటికి పూర్తి చేయాలని, పైపుల నిర్మాణం లో నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు.. 

పాలకీడు మండలంలో జవహర్ జానపహాడ్ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 10,000 ఎకరాలకి 302.20 కోట్లతో డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.కోమటికుంట, గుండ్లపహాడ్ చెరువులకి నీరు వచ్చేలా కాలువ ఏర్పాటు కి పరిశీలించాలని అధికారులకి సూచించారు బెట్టే తండా  లిప్ట్ ఇరిగేషన్ ద్వారా 2041 ఎకరాలకి 26.02 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని జానపాడు, బెట్టే తండా లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పూర్తి ఐతే శాశ్వతంగా నీరు అందించి పాలకీడు మండలం సస్యశ్యామలం అవుతుందని అన్నారు.నక్కగూడెం లిప్ట్ ఇరిగేషన్ 3200 ఎకరాలకి నీరు అందించేందుకు 31 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నామని డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.పులి చింతల ద్వారా విద్యుత్ తయారీ చేసిన నీటి ద్వారా రాజీవ్ గాంధీ లిప్ట్ ఇరిగేషన్ ద్వారా మేళ్లచెర్వు, కోదాడ, చిలుకూరు, చింతలపాలం మండలాలకి చెందిన 14100 ఎకరాలకు 320 కోట్ల తో నిర్మించటం జరుగుతుందని తెలిపారు.

Read More నిజాయితీని నిర్బంధిస్తున్న డిప్యూటీ కమిషనర్...

మహంకాళిగూడెం, మంచ్య తండా ఎత్తి పోతల పథకాలకి మరమ్మతులు చేపించాలని అధికారులని ఆదేశించారు.
బూరుగడ్డ చెరువు సర్వే చేసి కబ్జాలో ఉన్న వారిని తొలగించి సరిహద్దులు గుర్తించాలని తెలిపారు.తక్కువ ఖర్చు తో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చేందుకు స్మాల్, మీడియం లిప్ట్ ఇరిగేషన్ లు నిర్మిస్తున్నామని రైతుల నుండి సేకరించిన భూములకి నష్ట పరిహారం ఇస్తామని ,పైపులు భూమి లోపటి నుంచి వేసి పైన సాగు చేసుకోవచ్చు అని భూ సేకరణ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులను ఒప్పించాలని ఆదేశించారు.

Read More సకల సౌకర్యాలతో మండల కార్యాలయాల సముదాయం నిర్మాణానికి ప్రణాళికలు..

కోదాడ, హుజుర్ నగర్ లలో ఆధునికరణ బస్టాండ్ లకి పంద్రాగస్ట్ రోజున శంకుస్థాపన. కోదాడ బస్ స్టాండ్ ని ఆధునికరణ బస్ స్టాండ్ గా నిర్మించుటకి 16.89 కోట్లు, హుజూర్ నగర్ నందు బస్ స్టాండ్ కొరకు 3.52 కోట్లతో మంజూరు చేశామని పంద్రాగస్ట్ రోజు కోదాడ, హుజూర్ నగర్ ఆధునికరణ బస్ స్టాండ్లకి శంకుస్థాపన చేస్తామని అధికారులు ఏర్పాటు చేయాలని 6 నెలల లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ప్రయాణికులకి మెరుగైన సౌకర్యాలు అందిస్తూ,పార్కింగ్, కాంటీన్, ఏ సి వెయిటింగ్ హల్, పిడింగ్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకి ఆదేశించారు.గరిడేపల్లి, నేరేడు చర్ల, మేళ్లచెరువు బస్టాండ్ లలో పరిశుభ్రం చేసి టాయిలెట్స్ నిర్మించాలని  కోదాడ- జానపాడు వయా మఠంపల్లి, నేరేడుచర్ల నుండి జానపాడు,చెన్నాయి పాలెం, యాత వాకిళ్ల, గానుగబండ, మోతే మండలం సిరికొండ లకి, కాపుగల్లు, యర్రవరం బస్సు ఏర్పాటు  చేయాలని  కాలేజీ విద్యార్థులు, బస్సు లు ఇబ్బంది పడుతున్నారని పలువురు సూచించగా మంత్రి కోదాడ డిపో కి ఎక్కువ బస్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Read More వేములవాడ ప్లంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అబ్దుల్ రజాక్

గడ్డిపల్లి,చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీయల్  పాఠశాలకి రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేయాలి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో 315.10 కోట్లతో 16 రోడ్ల పనులు 407.4 కి మి లు నిర్మిస్తున్నామని 46.70  కోట్లతో 6 బ్రిడ్జి లు నిర్మిస్తున్నామని, హుజూర్ నగర్ లో 8 కోట్లతో ఆర్ & బి గెస్ట్ హౌజ్  నిర్మిస్తున్నామని,డి ఎం ఎఫ్ టి 20.44 కోట్లతో 10 రకాల పనులు నిర్మిస్తున్నామని, పాలకీడు,చింతలపాలెం లో ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కోదాడ నియోజకవర్గంలో 228.40 కోట్లతో 14 రోడ్ల పనులు 272 కి మి లు నిర్మిస్తున్నామని, 8కోట్లతో మునగాల కొక్కిరేని బ్రిడ్జి  నిర్మిస్తున్నామని అనంతగిరిలో 43కోట్లతో 3 బిల్డింగ్స్  నిర్మిస్తున్నామని,డి ఎం ఎఫ్ టి 6 పనులును 12.97కోట్లతోనిర్మిస్తున్నామని కమ్యూనిటీ హల్స్ నిర్మిస్తున్నామని ఎస్ ఈ సీతారామయ్య ఎస్ఈ సీతారామయ్య వివరించారు.
గడ్డిపల్లి,చిలుకూరు యంగ్ ఇండియా రెసిడెన్సీ యల్  పాఠశాలకి రోడ్లకి అధిక ప్రాధాన్యతనిస్తూ పూర్తి చేస్తేనే పాఠశాల పనులు వేగంగా పూర్తి చేయుటకి అవకాశం ఉంటుందని అలాగే సాలర్జాంగ్ పేటలో ఈద్గా, కమ్యూనిటీ హాల్ త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారుWhatsApp Image 2025-08-05 at 5.29.38 PM

Read More ఎవరికి ఓటు వేస్తావని అడగకుండానే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం

About The Author