వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

సూచించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్.

WhatsApp Image 2025-08-01 at 7.30.07 PM

 నిర్మల్: నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని  ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శుక్రవారం  భైంసా లోని ఆయన నివాసం లో వసతి గృహ సంక్షేమ అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా  ఆయన మాట్లాడారు. హాస్టల్ లలో విద్యార్థుల సంఖ్య ను అడిగి తెలుసుకున్నారు. తక్కువ విద్యార్థులుంటే  అందుకు కారణాలేంటో  తెలుసుకొని విద్యార్థుల సంఖ్య పెంచాలని  సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో  సంక్షేమ వసతి గృహాన్ని  ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు రోగాలు దరిచేరకుండా  జాగ్రత్తలు వహించాలన్నారు. మెనూ ప్రకారం  పౌష్టిక ఆహారాన్ని  అందించాలని సూచించారు. వసతి గృహాల్లో  ఖాళీగా ఉన్న పోస్టులు, సమస్యలపై ఆరా తీశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి  పేద విద్యార్థులకు అండగా ఉండాలని సూచించారు. సమావేశంలో వార్డెన్లు పాల్గొన్నారు.

Read More పాత ఇండ్ల కూల్చివేతకు అధికారుల నిర్లక్ష్యం..

About The Author