గీతం జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవం..
కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ..
భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి సహకారంతో కార్యక్రమం..
భిన్నంలో ఏకత్వంతో పాటు ఐక్కతకు చిహ్నం భారత్ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ. జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని రాజకీయ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల 'సర్దార్ వల్లభాయ్ పటేల్, రైతులు చంపారన్ నుంచి చిత్రకూట్ వరకు జాతీయ చర్చాగోష్ఠిని సోమవారం ఆయన జ్యోతి ప్రజ్వలనలతో లాంఛనంగా ప్రారంభించారు.
భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ... స్వాతంత్ర్యం తరువాత 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ పటేల్ అద్భుతమైన పాత్రను వివరించారు.రైతు ఉద్యమాలకు పటేల్ చేసిన సేవలు అంతగా వెలుగులోకి రాలేదన్నారు. చారిత్రాత్మక వార్రోలి సత్యాగ్రహం (1928) లో పటేల్ నాయకత్వాన్ని, రైతులు, భూమిలేని కార్మికుల సాధికారత కోసం సర్దార్ పటేల్ చేసిన కృషిని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రామీణ భారతదేశం జాతికి ఆత్మగా మిగిలిపోతుందని చెప్పారు.రైతులు, జాతీయ ఐక్యత పట్ల పబేల్ దృక్పథంపై ఈ చర్చాగోష్ఠిలో విలువైన చర్చలకు దారితీస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. మన జీవితాలను పేదలు, అణగారిన వర్గాలతో పంచుకోవడంలో ఆనందం ఉంది అని శ్రీ జిష్ణుదేవ్ వర్మ వ్యాఖ్యానించారు. అంతకు ముందు, శ్రీ జిష్ణుదేవ్ వర్మ, మహాత్మా గాంధీకి విగ్రహానికి పూలుచల్లి నివాళులు అర్పించి, ఆ తరువాత పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
