మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి సామాజిక బాధ్యత

బ్లూమింగ్ వొకేషనల్  కళాశాల  కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దూస్

కరీంనగర్: మాదక ద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యత అని బ్లూమింగ్ వొకేషనల్ కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దుస్ అన్నారు. మంగళవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నగరంలోని  బ్లూమింగ్ వొకేషనల్ జూనియర్ కళాశాల లో "డ్రగ్స్ నిర్మూలన మన అందరి బాధ్యత" అనే అంశం పై  సెమినార్ నిర్వహించడం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ అబ్దుల్ కుద్దూస్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ ను నిర్మూలించడంలో ముందుండాలని అన్నారు. విద్యార్థులు చైతన్య వంతులు అవుతూ దానిని నిర్మూలించడానికి మన వంతుగా అందరికీ దాని వల్ల కలిగే నష్టాలను ప్రతి ఒకరికి తెలియచేయవలసిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. విద్యార్థులను చైతన్య పరచడానికి పిలవగానే వచ్చిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి  అరవింద్ కు  ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు,

     ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నిరంతరం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కోసం పోరాటం అభినందనీయమని,  సామాజిక సమస్యల పైన విద్యార్థుల అవగాహన కొరకు ఇట్లాంటి సెమినార్లు నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలనలో ముందు ఉండాలని దానికోసం విద్యార్థులు చెడు మార్గంలో వెళ్లకుండా దానిని నివారించడానికి ప్రత్యేకంగా చైతన్యవంతులై అందరికి తెలియజేయాలని కోరారు, డ్రగ్స్ మాదకద్రవ్యాల వల్ల అనేకమంది  అనారోగ్యానికి గురవుతున్నారని  చెప్పారు. విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గన్నారపు రాకేష్ , విద్యార్థులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..WhatsApp Image 2025-08-05 at 4.59.21 PM

Read More  నడిచే దేవుళ్ళు డాక్టర్లు!

About The Author