నిజాయితీని నిర్బంధిస్తున్న డిప్యూటీ కమిషనర్...
తన మాట విననందుకు ఒక బిల్ కలెక్టర్ కు నరకం చూపిస్తున్న వైనం..
- ఈవిడతో చేతులు కలిపిన ఏఎంసీ,టాక్స్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్
- జీహెచ్ఎంసి సర్కిల్ 5 లో వెలుగు చూసిన దారుణం..
- అధికారుల వేధింపులకు బలైపోతున్న బిల్ కలెక్టర్ వీ. శ్రీశైలం..
- 2 సంవత్సరాల్లో నాలుగు సార్లు డాకెట్స్ మారుస్తూ హింసకు గురిచేస్తున్నారు..
- తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని వాపోతున్న బిల్ కలెక్టర్..
- తనకు వాలెంటరీ రిటైర్మెంట్ ఇప్పించాలని వేడుకోలు..
- ఈ మేరకు జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ. కర్ణన్ కు వినతిపత్రం..
- సక్రమంగా పనిచేస్తున్నందుకు ఒక ఉద్యోగికి దక్కిన ఫలితం...
- సూత్రదారి...పాత్రదారి కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్

హైదరాబాద్:
ఈ కాలంలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగులు ఉండటం ఎంతో అరుదు. అలాంటి వారు అక్కడక్కడ కనిపిస్తుంటారు. వారిని చూసినప్పుడల్లా సిస్టం మీద కొంతైనా గౌరవం పెరుగుతుంది. జీహెచ్ఎంసి అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యవస్థ. కానీ ఇక్కడే అవినీతి విచ్చలవిడిగా జరుగుతుంది. అయితే గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఒక ఉద్యోగి సర్కిల్ నెంబర్ 5 లో బిల్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతి సంపాదనకు ఈయన ఎంతో దూరం.కానీ అలాంటి వ్యక్తికి ఉన్నతాధికారుల నుండి వేధింపులు ఎదురవుతున్నాయి.
ఈ విషయంపై నిలదీసి అడిగినందుకు 4 సార్లు ఏరియాలు మారుస్తూ ఉన్నారు. తాను ఎవరికైనా నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు ఇవ్వబోతే నేను డిప్యూటీ కమిషనర్ కు, ఏఎంసీకి, ట్యాక్స్ ఇన్స్పెక్టర్, కంప్యూటర్ ఆపరేటర్లకు నచ్చడం లేదు.తాను పడుతున్న ఈ నరకయాతనను క్షుణ్ణంగా వివరిస్తూ జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్వీ.కర్ణన్ కు ఒక వినతిపత్రం అందజేశారు.బిల్ కలెక్టర్ వి.శ్రీశైలం.నిజాయితీగా పనిచేయలేకపోవడం, ఆరోగ్యం క్షీణించడం, వేధింపులు భరింపలేకపోవడంతో తనకు వీఆర్ఎస్ ఇప్పించాలని కమిషనర్ కు తన వినతిపత్రంలో విన్నవించుకున్నారు.అంతే కాకుండా తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, అవన్నీ తాను చూపిస్తానని తెలిపాడు. తాను ఏదైనా ప్రాపర్టీస్ చెక్ చేయడానికి కూడా వెళ్లనీయడం లేదని, నీకెందుకు అవన్నీ మీ టాక్స్ ఇన్సెపెక్టరు చూసుకుంటాడని డిప్యూటీ కమిషనర్ బెదిరిస్తున్నారని ఆయన వాపోయారు. ఒక బిల్ కలెక్టర్ గా తనకు ఆ బాధ్యత ఉంది కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసి ఖజానాకు లక్షల రూపాయల ఆదాయం రాకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారని.. కమర్షియల్ కాంప్లెక్స్ లకు నోటీసులు ఇవ్వడానికి వెళ్తే, డిప్యూటీ కమిషనర్ కార్యాలయం నుంచి ఫోన్ వస్తుందని, అర్జెంట్ గా మేడం ఆఫీసుకు రమ్మని చెప్పిందని చెబుతూ మేడం నిన్ను అక్కడికి వెళ్ళొద్దని చెప్పిందని కిరణ్ అంటూ తనను అడ్డుకుంటున్నారని తన ఆవేదన తెలియజేశారు.
మేడం మీరు తప్పు చేస్తున్నారని చెబితే,నీవు ఆఫ్ట్రాల్ బిల్ కలెక్టర్ వి,ఇలా నాకు ఎదురు చెబుతావా..? నాకు సలహాలు ఇస్తావా..? అని తిడుతూ తనను ఇలా ఏరియాలు మారుస్తున్నారని బిల్ కలెక్టర్ శ్రీశైలం జీహెచ్ఎంసి కమిషనర్ కు తన ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ విజిలెన్స్ సెల్ కి ఆదేశాలు ఇస్తే,తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు, బిల్డింగ్ ఫోటోస్ చూపిస్తానని తెలియజేశారు. ఒకవేళ తాను తప్పు చేస్తే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోమని, వీళ్ళు పెట్టే టార్చర్ భరించడం ఇక తన వల్ల కాదని, ఈ విషయంపై విచారణ జరిపించండి.
జీహెచ్ఎంసికి రావలసిన ఆదాయాన్ని కాపాడండి. (పిటీఐ నెంబర్ 1031104981) ఇంటి నెంబర్ 11-7-249 కు సంబందించిన వాణిజ్య భవనం... కానీ, దాని ప్రస్తుత ఆస్తి పన్ను 36 వేల 9 వందల ఎనిమిది రూపాయలు.. అసలు లెక్క ప్రకారమైతేఇంచుమించుగా 4 లక్షల రూపాయలకు పైమాటే.. కానీ మామూళ్లకు అలవాటు పడి వాణిజ్య భవనం పన్ను పెంచకుండా వారి జేబులు నింపుకుంటున్నారు. ఈ అవమానాలను భరించలేను. తనకు తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ ఇప్పించగలరని తన వినతిపత్రంలో వేడుకున్నారు. సంబంధిత కాపీని జోనల్ కమిషనర్ ఎల్బీనగర్, అడిషనల్ కమిషనర్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ సెల్ జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం,అన్ని వర్కింగ్ యూనియన్లకు, పాత్రికేయులకు పంపించారు.అలాగే బిల్డింగ్ ఫొటోస్, నోటీసు అకనాల్డ్జ్ మెంట్ కాపీలు కూడా జతచేసినట్లు ఆయన తెలియజేశారు. మరి ఈ విషయంపై జీహెచ్ఎంసి కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి..
