సివిల్ డిపార్ట్మెంట్ లో వసూళ్ల దందా.

మణుగూరు :

రోజురోజుకు పెరుగుతున్న క్లాస్-4
కాంట్రాక్టర్ కావాలంటే అనుభవం అవసరం లేదు.
అంతా పెద్ద సార్ చూసుకుంటారంటా.
వర్కుల్లో పర్సటేజ్ నీకెంతా.. నాకెంతా.?
కొనసాగుతున్న మామూళ్ల పర్వం
బహుమతులతో ప్రసన్నం చేసుకుంటున్న వైనం
నాకేమి కాదంటున్నా కాంట్రాక్టర్ 
తిష్టేసి రాజ్యమేలుతున్న వడ్డాణం

WhatsApp Image 2025-08-21 at 6.35.43 PM

మణుగూరు సింగరేణి ఏరియా జియం కార్యాలయంలో గల సివిల్ డిపార్ట్మెంట్ లో ఓ కాంట్రాక్టర్ అవినీతి అక్రమాలతో రాజ్యమేలుతున్నాడు. కొత్తగా వచ్చిన అధికారులు కూడా అతని మోచేతి నీళ్లు త్రాగాల్సిందేనని పలువురు కాంట్రాక్టర్లు చర్చించుకుంటున్నారు. రోజురోజుకు క్లాస్-4 కాంట్రాక్టర్లు సింగరేణిలో పెరుగుతున్నారు. క్లాస్ -4 కాంట్రాక్టర్ల చేత దొంగ టెండర్లు వేయించి వారు దక్కించుకున్న వర్కులను ఆయన వశంచేసుకుంటాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతగాడిపై పత్రికలో కధనం వస్తే అంతా పెద్ద సార్ కడుకుంటారులే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే పెద్ద సార్ ఈయన చెప్పుచేతల్లో ఉన్నాడంటే వారి మధ్య సాన్నిహిత్యం 'మామూళ్ల'గా లేదని చెప్పవచ్చునని తోటి కాంట్రాక్టర్లు చర్చించుకోవడం గమనార్హం. 

Read More స్నేహిత ద్వారా విద్యార్థులకు ధైర్యం, భరోసా కల్పించాలి

కాంట్రాక్టర్ కావాలా..  అర్హతతో పని లేదు : 

Read More వేములవాడ నేతలు జూబ్లీ బాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియాలో క్లాస్-4 కాంట్రాక్టర్లు రోజురోజుకు పెరిగిపోతున్నారు. వాళ్ళకి ఎటువంటి అనుభవం లేకున్నా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉండి సివిల్ డిపార్ట్మెంట్ లోని తిష్టవేసి ఉన్న క్లాస్-1 సివిల్ కాంట్రాక్టర్ ను కలిస్తే నీకు 'మామూళ్ళు'గానే పని ఐపోతుందని బహిరంగంగా తోటి కాంట్రాక్టర్లు గుసాగుసలాడుతున్నారు. వడ్డించే వాడు మనవాడైతే అన్న చందంగా సంబంధించిన అధికారులు ఆయన చెప్పు చేతల్లో ఉన్నపుడు కావాల్సిన కాడా సంతకాలతో ఫైల్ మన ముందు ఉంటుందని చెప్పకనే చెప్పవచ్చుని పలువురు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. క్లాస్-4 కాంట్రాక్టర్లు కావాలంటే క్లాస్-1 కాంట్రాక్టర్ల దగ్గర సూపర్వైజర్ వర్క్ చేసిన అనుభవం ఉండాలని సింగరేణి కాలరీస్ నిబంధనలు చెపుతున్నాయి. కానీ ఎటువంటి అనుభవం లేకున్నా పైసలు ఉంటే ఫైల్ కు చక్రాలు కట్టుకొని పరుగెత్తుకుంటూ కాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంటుందనది ఓ సివిల్ కాంట్రాక్టర్ పరిచయస్తులను తెలుపుతున్న సిద్ధాంతం. 

Read More మణుగూరులో శైవ క్షేత్రాలకు కార్తీక శోభ

 క్లాస్-4తో మైనస్ టెండర్లు :

Read More యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి - సీఐ డి నరేష్ కుమార్.

సింగరేణిలో ఓపెన్, సామజిక కోణంలో టెండర్లు కొనసాగుతాయి. ఓపెన్ బిడింగ్ కు వచ్చే సరికి పోటీ తత్వం ఉడడంతో వర్కులకు బిడింగ్ అందరూ వేసుకోవచ్చు. అదే సామాజిక కోణంలో అయితే ఎస్సి, ఎస్టీ వర్గాలకు చెందిన వారు మాత్రమే బిడింగ్ లో పాల్గొంటారు. ఓపెన్ బిడింగ్ కు సభ్యత్వం తీసుకున్న వారు మాత్రమే యూనియన్ గా ఏర్పడి అందులోంచి ఒక్కరూ మాత్రమే బిడింగ్ లో పాల్గొని వర్క్ దక్కించుకుంటారు. తిష్టవేసిన కాంట్రాక్టర్ మాత్రం కుంతంత్రాలతో వర్కులు దక్కించుకోవలని పాచికలు వేసి సామాజిక వర్గాల మధ్య చీలికలు తీసుకువచ్చి మిన్నకుండి పోతాడు. చివరికి రెండు కోతులు రొట్టె కోసం కొట్టుకున్న చందంగా ఆయన మైనస్ బిడింగ్ లతో వర్కులు దక్కించుకుంటున్నారని తోటి కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More కార్తీక పౌర్ణమి వేడుకల్లో దీపాలు వెలిగించిన జగ్గారెడ్డి

విజిలెన్స్ దృష్టి సారించాలి :.

Read More జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు : డిసిఓ వెంకటేశ్వర్లు

మణుగూరు సింగరేణి జియం కార్యాలయంలోని సివిల్ డిపార్ట్మెంట్ పై విజిలెన్స్ అధికారులు దృష్టి సారిస్తే అందులో జరిగే అక్రమ క్లాస్ -4 కాంట్రాక్టర్ల బాగోతం బట్టబయలు అవుతాయని కార్మిక సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు. అక్రమంగా క్లాస్-4 కాంట్రాక్టర్లగా లైసెన్సులు పొందే వారిని కట్టడి చేసి బ్రష్టు పట్టిన సివిల్ డిపార్ట్మెంట్ కి దుమ్ముదులి వదిలించాలని తోటి కాంట్రాక్టర్లు వేడుకొంటున్నారు. 

Read More ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

About The Author