కాంగ్రెస్‌ నేతల గారడీ మాటలు నమ్మొద్దు

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చెప్పే గారడీ మాటలు ప్రజలు నమ్మొద్దని బీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావు(Madhavaram Krishna Rao) అన్నారు. బాలాజీనగర్‌ డివిజన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. 60 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అనేక ప్రజాసమస్యలను పరిష్కరించిన ఘనత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పాలించే రాష్ట్రాల్లో కనీసం రెండు వేల పింఛన్‌, 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. బాలాజీనగర్‌ డివిజన్‌లో అన్ని కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, పార్కులు అభివృద్ధి చేశామని, రంగధాముని చెరువును సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. మరోసారి బీఆర్‌ఎ్‌సను గెలిపిస్తే చెరువులన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్‌ఎ్‌సను గెలిపించాలన్నారు. బాలాజీనగర్‌ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దామని, అభివృద్ధిని చూసి తనను గెలిపించాలని కృష్ణారావు కోరారు. కార్పొరేటర్‌ శిరీష, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, హరనాథ్‌ పాల్గొన్నారు.

About The Author