14 టైర్ల లారీ ఓనర్ల నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా దుగ్గెంపూడి ఈశ్వర్ రెడ్డి

మణుగూరు ఫిబ్రవరి 03 (భారతశక్తి): 14 టైర్ల టిప్పర్ల లారీ ఓనర్ల కాంగ్రెస్ అనుబంధ ఐ.ఎన్.టి.యు.సి సంఘం నూతన కమిటీని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పిరినాకి నవీన్ 15 మంది సభ్యులతో ప్రకటించారు. సోమవారం లారీ అసోసియేషన్ కార్యాలయం ఎదురుగా లారీ ఓనర్లు విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిరినాకి నవీన్ మాట్లాడుతూ 14 టైర్ టిప్పర్ల లారీ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ యూనియన్ నాయకులు అధ్యక్షులుగా కొనసాగేవారని తెలిపారు. గత పాలనలో బిఆర్ఎస్ అనుబంధ సంఘాల యూనియన్ నాయకులు అధ్యక్షులు గా వ్యవహరించారని, కాంగ్రెస్ పాలన లో కూడా వారే ఆధిపత్యం చేలాయిస్తూ వెల్ఫేర్ అసోసియేషన్ సొమ్మును కాజేస్తూ, లారీల ఓనర్ల మధ్య వివక్ష చూపుతూ, లారీలను కిరాయిలకు రానివ్వకుండా నిలుపుదల చేస్తున్నారని కొంతమంది లారీ ఓనర్లు స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదులు చేయడంతో నూతన కమిటీని ఎన్నుకొని లారీ ఓనర్లకు పారదర్శకంగా పనిచేయాలని సూచనలు చేశారని ఆయన మీడియాకు తెలిపారు. లారీ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగినవి 60, లేనివి 30 లారీలు ఉండగా, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్ టియుసి సంఘానికి అనుగుణంగా సభ్యత్వం కలిగిన ఓనర్లు 38 మంది సంతకాలు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ అధ్యక్షులు దుగ్గెంపూడి ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సింగరేణి ఉపరితల గనుల నుండి భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాట్రాక్టర్ల కు గత యూనియన్ నాయకులు వారి స్వలాభాల కోసం మా కష్టార్జితాన్ని తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లు మారిన సమయంలో లారీ కిరాయి పెంచే ప్రయత్నం చేయకుండా డ్రైవర్ల కు మాత్రమే జీతాలు పెంచి ఒప్పందం చేసుకొని వచ్చారని మండిపడ్డారు. కిలో మీటర్, టన్నుకు కు రూ.6.38 పైసలు బొగ్గు కాట్రాక్టర్ కు బిటిపిఎస్ చెల్లిస్తుంటే టిప్పర్ల ఓనర్లకు మాత్రం రూ.5.75 పైసలు చొప్పున చెల్లిస్తున్నారన్నారు. గతంలో మంచిర్యాల, భూపాలపల్లి, ఇల్లందు ప్రాంతాల నుండి 30 లారీల వరకు ఇక్కడి వచ్చి బిటిపిఎస్ బొగ్గు రవాణా చేసేవని వాటికి కూడా సమాన కిరాయి చెల్లించారని తెలిపారు. ఆ లారీలను ఇక్కడి ఓనర్లు కొనుగోలు చేయడంతో నాన్ లోకల్ లారీలు అంటూ వాటికి ఇచ్చే రూ.5.75 పైసల కిరాయి లో నుండి రూ.15 పైసలు తగ్గించి రూ.5.60 పైసలు చెల్లించడంతో ఆర్ధికంగా చాలా నష్టపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. సకాలంలో కిరాయి లు చెల్లించకపోవడంతో లారీల కిస్తీలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా కొత్తగా ఎన్నికైన ఐ.ఎన్.టి.యు.సి యూనియన్ కమిటీ పారదర్శకంగా లారీల ఓనర్ల కు సమాన కిరాయి చెల్లించేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. టిప్పర్ల లారీ ఓనర్లకు గుత్తేదారులతో మాట్లాడి సకాలంలో కిరాయిలు చెల్లించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శివ సైదులు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు తరుణ్ రెడ్డి, నూతన ఐ.ఎన్.టి.యు.సి కమిటీ సభ్యులు శాంత కుమార్, నాగభూషణం, దేవేందర్, బనాకర్, సంజీవ్, మల్లేష్, చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author