ప్రజా పాలనలో విద్యారంగం నిర్వీర్యం: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో విద్యారంగ సమస్యలను నిర్వీర్యం చేసిందనీ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని బీసీ హాస్టళ్ల సందర్శన లేనట్టేవుందనీ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ నిలదీశారు. శనివారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా విద్యారంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందనీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగానికి 15 శాతం రాష్ట్ర బడ్జెట్లో నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పి విద్యారంగానికి కేవలం 6% మాత్రమే కేటాయిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందనీ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలతో , స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతావుంటే, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సంవత్సరకాలం గడిచినా ఇంతవరకు విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించిన దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనట్లున్నాయని విమర్శించారు. విద్యారంగం సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే మాదిరిగా తయారు అయ్యాయని, దానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఎక్కడిక్కడ సమస్యలు పేరుకు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలు పెట్టిన దాఖలాలు రాష్ట్రంలో లేవనీ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చాలావరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయనీ, కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే ఒక్క మండలానికి రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తక్షణమే ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాతవాహన యూనివర్సిటీలో దాదాపు 40 పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా వాసి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో ఉన్న బీసీ కళాశాల హాస్టల్ లో అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉందనీ, ఇంతవరకు మంత్రి హోదాలో సందర్శించింది లేదని ఆరోపించారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కళాశాల మాజీ విద్యార్థి అయినా గాని ఎస్ ఆర్ ఆర్ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో మంత్రుల, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగుల శ్రీజ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కతురీ షాక్ నాయకులు శివ, కవిత, అంజలి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పాలనలో విద్యారంగం నిర్వీర్యం: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్

కరీంనగర్, ఫిబ్రవరి 8(భారత శక్తి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో విద్యారంగ సమస్యలను నిర్వీర్యం చేసిందనీ, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలోని బీసీ హాస్టళ్ల సందర్శన లేనట్టేవుందనీ
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ నిలదీశారు. శనివారం ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంకమ్మ తోటలోని జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా విద్యారంగానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందనీ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగానికి 15 శాతం రాష్ట్ర బడ్జెట్లో నిధులు ఇస్తామని చెప్పి మాట తప్పి విద్యారంగానికి కేవలం 6% మాత్రమే కేటాయిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందనీ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అనేక సమస్యలతో , స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతావుంటే, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. సంవత్సరకాలం గడిచినా ఇంతవరకు విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించిన దాఖలాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేనట్లున్నాయని విమర్శించారు. విద్యారంగం సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే మాదిరిగా తయారు అయ్యాయని, దానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమన్నారు. ఎక్కడిక్కడ సమస్యలు పేరుకు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం చర్చలు పెట్టిన దాఖలాలు రాష్ట్రంలో లేవనీ ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో చాలావరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయనీ, కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటే ఒక్క మండలానికి రెగ్యులర్ ఎంఈఓ లేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. తక్షణమే ఖాళీగా ఉన్న మండల విద్యాధికారి పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శాతవాహన యూనివర్సిటీలో దాదాపు 40 పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కరీంనగర్ జిల్లా వాసి, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లాలో ఉన్న బీసీ కళాశాల హాస్టల్ లో అన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉందనీ, ఇంతవరకు మంత్రి హోదాలో సందర్శించింది లేదని ఆరోపించారు. అదేవిధంగా ఎస్ఆర్ఆర్ కళాశాల మాజీ విద్యార్థి అయినా గాని ఎస్ ఆర్ ఆర్ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోకపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల రానున్న రోజుల్లో మంత్రుల, ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు నాగుల శ్రీజ జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్కతురీ షాక్ నాయకులు శివ, కవిత, అంజలి తదితరులు పాల్గొన్నారు.

About The Author