విద్య పేరుతో దోపిడీ..
- కాగితాలకే పరిమితమైన నియంత్రణ..
- చట్టాలు చేయడం చేతులు దులుపుకోవడం..
- ప్రభుత్వాలను ఖాతరు చెయ్యని ప్రైవేట్ విద్యా సంస్థలు..
- మరీ బరితెగించిపోతున్న ఇంజినీరింగ్ కాలేజీలు..
- ఈ ఏడాది ఫీజుల పెంపునకు నిరాకరించిన సర్కారు..
- పాత ఫీజులనే అమలు చేయాలని నిర్ణయం..
- రక రకాల పేర్లు పెడుతూ అధిక డబ్బులు వసూలు చేస్తున్న కాలేజీలు..
- బిల్డింగ్ ఫండ్, లైబ్రరీ ఫండ్ అంటూ తల్లి దండ్రులను పీక్కు తింటున్న వైనం..
- ఈ ఏడాది కొత్త ఫీజుల అధ్యయనానికి ప్రభుత్వం ఒక కమిటీ కూడా వేసినట్లు సమాచారం..
- కమిటీల నిర్ణయాన్ని, ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కాలేజీ యాజమాన్యాలు.. !
- రాజకీయ పలుకుబడితో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న దుర్మార్గం..
- న్యాయపోరాటానికి సిద్దమైన " కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి.."
ప్రభుత్వం చట్టాలు చేస్తే మాకేంటి..? కమిటీలు వేస్తే మాకేంటి..? మా దారిన మేము నడుస్తాం.. మాకు నచ్చినట్లు మేము చేసుకుంటాం.. ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసుకుంటాం.. మమ్మల్ని నిరోధించేవారు ఎవరూ లేరు.. అంటూ పేట్రేగిపోతున్నారు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు.. మరీ ముఖ్యంగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల పద్ధతి అత్యంత దుర్మార్గంగా కనిపిస్తోంది.. రక రకాల పేర్లతో.. విద్యార్థుల తల్లి దండ్రుల నుంచి ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేస్తున్నారు.. నియంత్రించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు నిమ్మకుండి పోవడంతో కాలేజీల యాజమాన్యాలు పెట్రేగిపోతున్నాయి.. దీనికి కారణాలు అనేకానేకం.. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు రాజకీయ, ప్రభుత్వ పెద్దలతో ముడివడి ఉంటారు.. సత్సంబంధాలు కలిగి ఉంటారు.. అదేకాకుండా వారికి దూరపు, దగ్గరి బంధువులై ఉంటారు.. దీనితో అస్మదీయులకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం తమవంతుగా కావాల్సినంత సహాయం చేస్తూ ఉంటారు.. దీని వెనుక పెద్ద కారణం కూడా ఉంది.. ఎన్నికల్లో డబ్బులు కావాలంటే వీరు సహాయం చేస్తారు.. పార్టీ ఫండ్ ఇస్తారు.. తాము చెప్పిన వారికి సీట్లు ఇచ్చేస్తూ ఉంటారు.. దీంతో కాలేజీల యాజమాన్యాలతో స్నేహపూర్వకంగా ఉంటారు ప్రభుత్వ, రాజకీయ పెద్దలు.. ఇంకేముంది.. దోపిడీ పర్వం కొనసాగుతూనే ఉంటుంది.. చివరికి బలైపోయేది సామాన్య, పేద, మధ్యతరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు మాత్రమే.. ఈ కార్పొరేట్ విద్య నియంత్రణకు ఎన్నో ఏళ్లుగా పోరాటం సాగిస్తోంది " కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి ".. అన్ని వర్గాల వారికి న్యాయంగా అందాల్సిన విద్య కోసం ప్రయత్నిస్తోంది.. ప్రస్తుతం మనం ఇంజినీరింగ్ విద్య గురించి మాట్లాడుకుందాం..
కానీ ప్రభుత్వ ఫీజులను పక్కనబెడితే.. ఇతరత్రా రూపాన కాలేజీ యాజమాన్యాలు ఇబ్బడి ముబ్బడిగా దోచుకున్నాయని, దోచుకుంటూనే ఉన్నాయన్నది వాస్తవం..
ఇంజినీరింగ్ విద్యలో ప్రతి మూడేళ్లకోసారి ఫీజుల పెంపు ప్రక్రియ సాగుతోంది. కాలేజీల్లో మౌళిక వసతులు, విద్యా ప్రమాణాలు పెంచుకున్నా.. కొన్ని కాలేజీలు అత్యధిక ఫీజు పెంపు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో కాలేజీల్లో వసతులు, నిబంధనల అమలుపై నాటి టాస్క్ పూర్స్ నివేదికలు బయటపెట్టాలని సర్కారు ఆలోచన. దీంతో ఇప్పుడు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు కొత్త దారులు వెతుక్కున్నారు.. రాష్ట్రంలో మొత్తం 174 ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే అందులో 155 ప్రైవేట్ వే. వీటిలో ఇంకా నాలుగు కాలేజీలకు ఏఐసీటీయూ అనుమతులు రావాల్సి ఉందని తెలుస్తోంది..
మొత్తంగా ఫీజుల పెంపు తాత్కాలికంగా బ్రేక్ పడినా.. కౌన్సిలింగ్ సమయానికి అధ్యయనం పూర్తి అయ్యి ఉంటే స్వల్పంగా పెంచే అవకాశం లేకపోలేదు. అధ్యయనం ఆలస్యం అయితే ఈ ఏడాది పాత ఫీజులతోనే విద్యార్థుల చదువులు బయటపడనున్నాయి. అంటే వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ ఫీజులు పెరుగుతాయన్నమాట.
అయితే ప్రభుత్వం నిర్ణయించే ఫీజులపై కాకుండా కాలేజీల యాజమాన్యాలు సరికొత్త మెనూలతో విద్యార్ధులపై మోపే ఫీజుల భారాన్ని కూడా అరికట్టాలన్నది " కార్పొరేట్ విద్యా నియంత్రణ మండలి " డిమాండ్.. కాలేజీల యాజమాన్యాలు విధించే అసంబద్ధమైన ఇతర ఫీజులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి.. అప్పుడే విద్యార్థుల తల్లి దండ్రుల మీద ఒత్తిడి తగ్గుతుంది.. పైగా గత మూడేళ్ళుగా ఫీజు రీ యంబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోయాయి.. ముందు వీటిని ప్రభుత్వం చెల్లించాలని కోరుతోంది.. దీనిపై ఇప్పటికే కొన్ని ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి తమకు అనుకూలంగా ఉత్తర్వులు కూడా సాధించారని ఇంతకు ముందే మేము తెలియజేశాము.. కనుక ఈ బకాయిలు చెల్లించడంతో బాటు.. యాజమాన్యాల ఇతర అక్రమ ఫీజు వసూళ్లను కూడా అరికట్టాలి..
ఇది ఈ వాల్టి ప్రత్యేక కథనం.. మరో స్పెషల్ స్టోరీ తో మీ ముందుకు వస్తాం.. అంతవరకు సెలవు.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాలకు గ్లోబల్ 360 టీవీని సబ్ స్క్రయిబ్ చేయండి..