ఫర్టిలైజర్ దుకాణాల్లో అందుబాటులో ఉన్న ఎరువులను స్టాక్ బోర్డుల్లో ప్రదర్శించాలి..

రైతులకు గుర్తింపు పొందిన సంస్థలు తయారు చేసే నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులను మాత్రమే విక్రయించాలని పేర్కొన్నారు. రైతులకు వారువేసిన పంటను బట్టి, భూసారాన్నిబట్టి తగిన మోతాదులో అవసరమైనన్ని ఎరువులను ఇవ్వాలన్నారు. జిల్లాలో తగినంత యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. యూరియా, ఇతర ఎరువుల క్రయవిక్రయాలకు సంబంధించిన వివరాలన్నీ జాగ్రత్తగా పొందుపరచాలని సూచించారు. గడువు ముగిసిన పురుగుల మందులను ఎట్టి పరిస్థితుల్లో విక్రయించవద్దని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025