కొత్త రేషన్ కార్డులతో ప్రభుత్వ పథకాలు మరింత మెరుగ్గా అమలవుతాయి..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారత శక్తి)జూలై 29: ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ మరింత మెరుగ్గా ప్రజలకు చేరుతాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డులను నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చాలా ఏళ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు లబ్ధిదారులకు చేరడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అర్హులైన వారందరికీ నాణ్యమైన సన్నబియ్యాన్ని అందిస్తుందని అన్నారు.

నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీ తో మరింత మంది ప్రజలు ప్రభుత్వ పథకాలను పొందగలుగుతారని అన్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరయ్యాయని అన్నారు. పేద ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందిస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, తహసిల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, రేషన్ కార్డుల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
02 Aug 2025