హుజుర్నగర్ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా

తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధం
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన- మంత్రి ఉత్తమ్

WhatsApp Image 2025-11-12 at 6.57.48 PM

సూర్యాపేట : 

Read More కాంగ్రెస్ లో చేరిన ఉటూరు బీఆర్ఎస్ నేతలు

సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 250 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ ఇంటిగ్రేటెడ్  పాఠశాల వరకు 8.28 కోట్ల అంచనా వ్యయంతో రెండు లైన్ల బి.టి రహదారి నిర్మిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు బుధవారం సాయంత్రం రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్,ఎస్.పి నరసింహ, ఆర్.డి.ఓ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన హరిజన గిరిజన ముస్లిం మైనారిటీ వర్గాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని అన్నారు.అటువంటి పాఠశాలలకు పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగ గడ్డిపల్లి గ్రామం నుండి పాఠశాల నిర్మిస్తున్న ప్రాంతానికి రవాణా వసతికి గాను 8.28 కోట్ల అంచనా వ్యయంతో రెండు లైన్ల రహదారి నిర్మాణం పనులు చేపట్టామన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు గాను గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.అనంతరం అదే గ్రామంలోనీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తాజాగా సంభవించిన భారీ వర్షాలకు తడిసి పోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు.ఇది రైతు పక్ష పాత ప్రభుత్వమని రైతాంగానికి ప్రభుత్వం అన్ని విధాలుగా బాసటగా నిలుస్తుందని ఆయన చెప్పారు.స్వతంత్ర భారత దేశంలో ముందెన్నడూ లేని రీతిలో తెలంగాణా రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించడం చరిత్రాత్మకమని ఆయన అన్నారు.రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనుకూల విధానాలకు తెలంగాణా రాష్ట్రం ధాన్యం దిగుబడిలో సృష్టించిన రికార్డ్ నిదర్శనమన్నారు.29 రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ ఇప్పటివరకు ఇంతటి ఉత్పత్తి రాలేదని ,రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడి సాధించిన రైతాంగాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఎక్కడ కుడా రైతాంగం అవస్థలు పడకుండా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు.ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పై ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు.కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ప్రభుత్వ రికార్డ్ లలో నమోదు అయిన 48 గంటల వ్యవధిలో నగదు చెల్లింపులు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామన్నారు.
మద్దతు ధర తో పాటు సన్నాలకు బోనస్ లు కూడా చెల్లించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.. 
.
ధాన్యం కొనుగోలుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు పెట్ట బోతుందన్నారు.ధాన్యం దిగుబడి లొనే కాకుండా ధాన్యం కొనుగోలు లోను తెలంగాణా రాష్ట్రం రికార్డ్ సృష్టించబోతుందన్నారు .80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల కు ఉపక్రమించిందన్నారు. 29 రాష్ట్రాలలో ఏకంగా 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్న తెలంగాణా రాష్ట్రం ధాన్యం కొనుగోలులోను అగ్రభాగాన నిలుచోవడం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివర్ణించారు.. 

Read More అంధుల పాఠశాల విద్యార్థినితో కలిసి పాడిన జిల్లా కలెక్టర్

About The Author