సమ్మిళిత ప్రగతియుత బడ్జెట్ : మాజీ మేయర్ సునీల్ రావు
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి): సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ప్రగతిని, సంక్షేమ ఫలాలను అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారని మాజీ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో వేతన శ్రమజీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామలన్నారు. ఆదాయ పన్ను విషయంలో 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఇన్ కం టాక్స్ చెల్లించకుండా బడ్జెట్ పొందుపరచడం ఉద్యోగులకు ఆర్థికంగా మేలు చేస్తుందన్నారు.సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు 1.5 లక్షల కోట్లు కేటాయించడం వల్ల పారిశ్రామిక వికాసం కనిపించనుందని చెప్పారు. రుణాల పరిమితిని రూపాయలు ఐదు కోట్ల నుంచి పది కోట్లకి పెంచడం వల్ల చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మేలు జరగనుందని, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూపాయలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల పెంచడం తో అన్నదాతలకు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందని తెలిపారు. పండ్లు కూరగాయలు సాగు చేసే వారికి కొత్త పథకాలను ప్రవేశపెట్టడం శుభ పరిణామనీ చెప్పారు. కొత్తగా వైద్య కళాశాలలో సీట్లు పెంచే నిర్ణయంతో పేద కుటుంబాల్లోని పిల్లలు వైద్యులుగా మారెందుకు అవకాశం ఉంటుందని, విద్యార్థుల విజ్ఞానాన్ని అందించేందుకు అటల్ టింకల్ యోజన ద్వారా మరిన్ని ల్యాబులు పెంచడం వల్ల కరీంనగర్ జిల్లాకు కూడా మేలు జరగనుందని సంతోషం వ్యక్తం చేశారు. అటల్ టింకిల్ ల్యాబులను పెంచాలని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కరీంనగర్ ఎంపీ, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి విన్నవించడం వల్లనే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు మేలు జరుగుతుందని గుర్తుచేశారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించిన నిధులు ఎక్కువ మొత్తం కేటాయించడం హర్షనీయన్నారు. పట్టణంలోని పేద మహిళలకు రూపాయలు 30 వేల వరకు యూపిఐ లింక్ క్రెడిట్ కార్డులను ఇవ్వాలనే నిర్ణయం చాలా గొప్పదని, కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని ప్రభుత్వానికి నగర ప్రజల పక్షాన సునీల్ రావు హర్షం ప్రకటించారు.
కరీంనగర్, జనవరి 1(భారత శక్తి):
సబ్బండ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ప్రగతిని, సంక్షేమ ఫలాలను అందించే ఉద్దేశ్యంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ శనివారం పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టారని మాజీ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఒక ప్రకటనలో వేతన శ్రమజీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామలన్నారు. ఆదాయ పన్ను విషయంలో 12 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఇన్ కం టాక్స్ చెల్లించకుండా బడ్జెట్ పొందుపరచడం ఉద్యోగులకు ఆర్థికంగా మేలు చేస్తుందన్నారు.సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు 1.5 లక్షల కోట్లు కేటాయించడం వల్ల పారిశ్రామిక వికాసం కనిపించనుందని చెప్పారు. రుణాల పరిమితిని రూపాయలు ఐదు కోట్ల నుంచి పది కోట్లకి పెంచడం వల్ల చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి మేలు జరగనుందని, రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని రూపాయలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల పెంచడం తో
అన్నదాతలకు ఆర్థికంగా తోడ్పాటు అందుతుందని తెలిపారు. పండ్లు కూరగాయలు సాగు చేసే వారికి కొత్త పథకాలను ప్రవేశపెట్టడం శుభ పరిణామనీ చెప్పారు. కొత్తగా వైద్య కళాశాలలో సీట్లు పెంచే నిర్ణయంతో పేద కుటుంబాల్లోని పిల్లలు వైద్యులుగా మారెందుకు అవకాశం ఉంటుందని,
విద్యార్థుల విజ్ఞానాన్ని అందించేందుకు అటల్ టింకల్ యోజన ద్వారా మరిన్ని
ల్యాబులు పెంచడం వల్ల కరీంనగర్ జిల్లాకు కూడా మేలు జరగనుందని సంతోషం వ్యక్తం చేశారు. అటల్ టింకిల్ ల్యాబులను పెంచాలని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కరీంనగర్ ఎంపీ, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలిసి విన్నవించడం వల్లనే పెద్ద సంఖ్యలో విద్యార్థులకు మేలు జరుగుతుందని గుర్తుచేశారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించిన నిధులు ఎక్కువ మొత్తం కేటాయించడం హర్షనీయన్నారు.
పట్టణంలోని పేద మహిళలకు రూపాయలు 30 వేల వరకు యూపిఐ లింక్ క్రెడిట్ కార్డులను ఇవ్వాలనే నిర్ణయం చాలా గొప్పదని, కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా ఉందని ప్రభుత్వానికి నగర ప్రజల పక్షాన సునీల్ రావు హర్షం ప్రకటించారు.
