
సూర్యాపేట :
కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని అదేవిధంగా రైతులు సరైన తేమశాతం తో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు.మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా, తిరుమలగిరి మండలం తొండ, కోక్యా నాయక్ తండా,ఫణిగిరి లలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా తొండలో ఎఫ్ పి వో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ కొనుగోలు కేంద్రానికి ట్యాగింగ్ చేసిన మిల్లు వివరాలు ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత ముందు పంపించాలని ఇదివరకే చెప్పడం జరిగిందని, ధాన్యం తడిచినప్పటికి ఇబ్బంది లేకుంటే మిల్లులకు పంపించాలని , పౌరసరఫరాల అధికారులు మిల్లర్లతో మాట్లాడి ధాన్యం తీసుకునే విధంగా చర్చించాలన్నారు.అనంతరం ఇదే మండలం కోక్యానాయక్ తాండ లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం డ్రైయర్ ను పరిశీలించారు. అంతేకాక రైతులతో మాట్లాడుతూ ఎంత దాన్యం తీసుకువచ్చారని తేమశాతం ఎంత ఉందని అడిగారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్ లను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని కుప్పలు వచ్చాయని సీరియల్ నెంబర్ ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తున్నది ?లేనిది? తనిఖీ చేశారు. 57 మంది రైతులు దాన్యం తీసుకు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కొనుగోలు కేంద్రానికి నియమించిన ఏఓ ,ఏఈఓ వివరాలను అడగడమే కాకుండా వారితో మాట్లాడారు. ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి లారీలు, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయ అని అడిగి తెలుసుకున్నారు. అంతేకాక ట్రక్ సీట్ వివరాలను అడిగారు. కేంద్రం ద్వారా ఇప్పటివరకు చేసిన చెల్లింపులు, తదితర వివరాలన్నింటిని కనుక్కున్నారు.ఫణిగిరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయాలని, సరైన తేమశాతంతో కొనుగోలుకు ఎన్ని కుప్పలు సిద్ధంగా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. హమాలీ ఎంత తీసుకుంటున్నారని? ప్రశ్నించారు. టాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తూకం సరైన విధంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి సరైన తేమ శాతం తో ధాన్యం వచ్చినట్లయితే జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని ఆదేశించారు . జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు ,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రాము,తిరుమలగిరి తహసిల్దార్ హరిప్రసాద్, తదితరులు ఉన్నారు