క్యాన్సర్ బాధితులకు అండగా జగ్గారెడ్డి
- క్యాన్సర్ పేషెంట్లకు రెండు లక్షల చొప్పున ఆరుగురికి ఆర్థిక సాయం
- గుట్కా తినకండి, సిగరెట్ తాగకండి.. క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయకండి
- ప్రజలకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపు

సంగారెడ్డి :
సంగారెడ్డి నియోజకవర్గంలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు జగ్గారెడ్డి తన సహాయాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో క్యాన్సర్ బారిన పడ్డ వ్యక్తులకు చికిత్స కోసం లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసిన విషయం తెల్సిందే. తాజాగా క్యాన్సర్ తో బాధ పడుతున్న మరో ఆరుగురికి జగ్గారెడ్డి రెండు లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం చేశారు.ఈ సందర్భంగా గుట్కా నమలడం కారణంగా అనారోగ్యం భారిన పడ్డ క్యాన్సర్ పేషంట్ పట్ల కాస్త ఆగ్రహం వ్యక్తంచేశారు.గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దురలవాట్ల కు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలను కోరారు.
