
కరీంనగర్ :
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిసి బస్సుల ప్రమాదాలతో ఈ మధ్యకాలంలో చాలా మంది తమ ప్రాణాల కోల్పోయారని చెప్పారు. చాలా మంది గాయపడి ఇబ్బందులు పడుతున్నారనీ, కుటుంబంలో వ్యక్తి దూరం అయితే అ యొక్క కుటుంబ పరిస్థితి రోడ్డు మీద పడే పరిస్థితి పడుతుందని అన్నారు. ప్రభుత్వం కూడ ఆర్టీసి బస్సు డ్రైవర్ల మీద ఒత్తిడి పెట్టి అదనపు డ్యూటీ వేస్తూ టార్గెట్ పెటడుతున్నారని ఆరోపించారు. వెంటనే రవాణ శాఖ మంత్రి గాయపడిన వారందరిని అదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా నాయకులు చంటి శ్రీనివాస్, కుతాడి శ్రీనివాస్, గాల్లపల్లి రత్నాకర్, హస్నాబాద్ రాజ్ కుమార్, కొత్తురి రఘు, దుర్శేట్టి లక్ష్మణ్, హుస్సేన్ తదితరులు ఉన్నారు.