ఉప్పల్‌లో ఐపీఎల్ సందడి.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు

  • సాయంత్రం 7.30కు ఎస్ఆర్హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
  •  మధ్యాహ్నం 12 నుంచే ట్రాఫిక్ ఆంక్షలు షురూ
  •  నగరవాసులకు తప్పని తిప్పలు.. మెట్రోనే బెటర్

ఉప్పల్‌లో ఐపీఎల్ సందడి.. నేడు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్:

సిటీలో క్రికెట్ ఫీవర్ మొదలైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య భారీ ఫైట్ జరగనుంది. అయితే మ్యాచ్ మజా ఒకవైపు ఉంటే.. ట్రాఫిక్ కష్టాలు మరోవైపు సామాన్యుడిని భయపెడుతున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం పోలీసులు భారీ బందోబస్తుతో పాటు ఉప్పల్ చుట్టుపక్కల రూట్లను డైవర్ట్ చేశారు.

ఏప్రిల్, మే నెలల్లో ఏడు రోజులు గండమే!*
కేవలం ఇవాళే కాదు.. ఏప్రిల్ 5, 13, 18, 21 తేదీలతో పాటు, మే 3, 6, 22 తేదీల్లో ఉప్పల్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడు రోజులు ఉప్పల్ జంక్షన్ మీదుగా వెళ్లాలంటే చుక్కలు కనిపించడం ఖాయం. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచే పోలీసులు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. రాత్రి 12 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి.

భారీ వాహనాలు ‘ఔట్’.. రూట్ మారిందిలా!*
లారీలు, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు, డీసీఎంలు ఉప్పల్ వైపు వస్తే పోలీసులు లోపలికి రానివ్వడం లేదు. వాటి కోసం వేరే రూట్లు ఫిక్స్ చేశారు:
 వరంగల్ నుంచి వచ్చే వాహనాలు:* ఘట్‌కేసర్ వద్దే ఔటర్ రింగ్ రోడ్డు (ORR) ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

 * ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చేవి:** నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర యూ-టర్న్ తీసుకుని భగ్యాత్, చెర్లపల్లి మీదుగా మళ్లించనున్నారు.

 * తార్నాక, రామంతాపూర్ సైడ్:** హబ్సిగూడ వద్దే నాచారం, ఎన్ఎఫ్సీ రోడ్డు వైపు దారి మళ్లించారు.WhatsApp Image 2026-04-12 at 19.33.28

పార్కింగ్ ఎక్కడంటే..?
స్టేడియం చుట్టుపక్కల మొత్తం 5 పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేశారు.
 1. *హబ్సిగూడ వైపు నుంచి వచ్చేవారు:* పెంగ్విన్ గ్రౌండ్స్ లేదా టీజీ ఐఏఎల్ఏలో వాహనాలు ఆపాలి.

 2. *ఎల్బీనగర్, రామంతాపూర్ నుంచి వచ్చేవారు:* డీఎస్ఎల్ ఓపెన్ స్పేస్, మోడ్రన్ బేకరీ ఏరియాల్లో పార్క్ చేయాలి.
 3. *వీఐపీలకు మాత్రమే:* స్టేడియం లోపల ఏ-గ్రౌండ్‌లో పార్కింగ్ ఉంటుంది. పాస్ ఉంటేనే లోపలికి ఎంట్రీ.

పోలీసు వారి సూచన:
మ్యాచ్ చూడటానికి వెళ్లే ఫ్యాన్స్ సాధ్యమైనంత వరకు మెట్రో రైలు లేదా ఆర్టీసీ బస్సులను వాడటం మంచిది. సొంత కార్లు, బైకులతో వెళ్తే పార్కింగ్ దొరక్క, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి సగం మ్యాచ్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. ఉప్పల్ మీదుగా వెళ్లే ప్రయాణికులు కూడా ప్రత్యామ్నాయ దారులను చూసుకోవడం ఉత్తమం.WhatsApp Image 2026-04-12 at 19.33.29 (1)

About The Author