జీహెచ్‌ఎంసీలో ‘డీజిల్’ దొంగలు..

నిబంధనలు తుంగలో తొక్కి రూ. కోట్ల ప్రజాధనం లూటీ!

జీహెచ్‌ఎంసీలో ‘డీజిల్’ దొంగలు..

హైదరాబాద్:
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎం.ఎం.సి), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సి.ఎం.సి) విభాగాల్లో ఇంధన సరఫరా, వాహనాల మరమ్మత్తుల పేరుతో అక్షరాలా కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలను, కమిషనర్ జారీ చేసిన స్పష్టమైన నిబంధనలను క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యంగా కవాడిగూడ వర్క్‌షాప్ కేంద్రంగా "ఫోర్‌మెన్ ఫారూక్" సాగిస్తున్న అవినీతి అక్రమాలు మున్సిపల్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కమిషనర్ ఆర్డర్‌ను ధిక్కరిస్తూ, నకిలీ కూపన్లు, ఫోర్జరీ సంతకాలతో సాగుతున్న ఈ 'డీజిల్ మాఫియా' వ్యవహారంపై ‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్’ సంస్థ సంచలన ఆధారాలను బయటపెట్టింది. ఉన్నతాధికారుల ముడుపుల అండతోనే ఫారూక్ లాంటి వారు సమాంతర దోపిడీ వ్యవస్థను నడుపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*కమిషనర్ సర్కులర్ నెం. 4089 భేఖాతరు.. ‘యాక్టింగ్ ఏఈ’గా ఫారూక్ అవతారం!

జీహెచ్‌ఎంసీ పరిధిలోని వాహనాలకు ఇంధనాన్ని కేటాయించే విషయంలో మున్సిపల్ కమిషనర్ స్పష్టమైన 'సర్కులర్ నెంబర్ 4089/జిహెచ్‌ఎంసి/హెచ్&ఎస్/2025' ను జారీ చేశారు. దీని ప్రకారం కేవలం సహాయక ఇంజనీర్లు (ఎ.ఈ) మరియు విభాగపు ఇంజనీర్లు (డి.ఈ) లాంటి ఉన్నతాధికారులు మాత్రమే ఆన్‌లైన్ డీజిల్ కూపన్లను పరిశీలించి, ఇష్యూ చేయాల్సి ఉంటుంది.
కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయింది. వర్క్‌షాప్‌లలో పనిచేసే ఫోర్‌మెన్‌లు, ముఖ్యంగా కవాడిగూడలో ఫారూక్ తానే ఉన్నతాధికారి అన్నట్లుగా అవతారమెత్తాడు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే ‘యాక్టింగ్ ఏఈ/డిఈ’గా చలామణీ అవుతూ యధేచ్ఛగా కూపన్లు జారీ చేస్తున్నాడు.WhatsApp Image 2026-06-16 at 20.59.10

దొంగ కూపన్ల దందా.. కోట్లల్లో గండి:
 మార్చి నెలకు సంబంధించిన ఆన్‌లైన్ డీజిల్ కూపన్లను ముందే ప్రింట్ తీసి, వాటిపై ప్రభుత్వ నకిలీ స్టాంపులు వేసి ఫోర్‌మెన్ ఫారూక్ దొంగచాటుగా భారీ ఎత్తున అమ్ముకున్నట్లు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

*కవాడిగూడ వర్క్‌షాప్‌లో ‘మరమ్మత్తుల’ మాయాజాలం.. నెలకు రూ. 35 లక్షల దోపిడీ!

డీజిల్ దందా మాత్రమే కాదు, జీహెచ్‌ఎంసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో అంతకు మించిన స్కామ్ నడుస్తోంది. ముఖ్యంగా కవాడిగూడ పరిధిలోని ట్రాన్స్పోర్ట్ సెక్షన్ లో వాహనాల రిపేర్లు మరియు మరమ్మత్తుల పేరుతో ఫారూక్ అండ్ గ్యాంగ్ అక్రమాలకు తెరలేపారు. వాహనాలు షెడ్డులోనే మూలుగుతున్నా, కండిషన్‌లో ఉన్నా సరే.. ప్రతి నెలా దాదాపు 'రూ. 35 లక్షల దొంగ బిల్లులు' సృష్టిస్తున్నారు. ఉనికిలో లేని వాహనానికి కూడా డీజిల్ కొట్టేస్తూ, నకిలీ రిపేర్ బిల్లుల ద్వారా ఏటా కోట్ల రూపాయల నిధులను ఈ అక్రమార్కుడు నొక్కేస్తున్నాడని ప్రధాన ఆరోపణ.

*జీపీఎస్ డేటాకు, కూపన్లకు పొంతనే లేదు!
ఆధునిక సాంకేతికత ప్రకారం ప్రతి మున్సిపల్ వాహనానికి లాగ్‌బుక్ తో పాటు జీపీఎస్ ట్రాకింగ్ ఉండాలి. వాహనం తిరిగిన కిలోమీటర్లకు, వినియోగించిన ఇంధనానికి ( కిలోమీటర్ ఫ్యూయల్ రేషియో) లెక్క సరిపోవాలి. కానీ, ప్రాథమిక ఆధారాల ప్రకారం వాహనాల జీపీఎస్ డేటాకు, ఆన్‌లైన్ కూపన్ల ద్వారా జారీ అయిన డీజిల్ పరిమాణానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. వాహనాలు రోడ్డెక్కకుండానే, కేవలం కాగితాల్లోనే వేల కిలోమీటర్లు తిరిగినట్లు చూపిస్తూ డీజిల్ ముంచేస్తున్నారు.

*విజిలెన్స్ కళ్ళు మూసిందా? ఏసీబీ విచారణ జరపాలి: 

ఈ భారీ కుంభకోణం గత మూడేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా.. జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఉన్నతాధికారులకు సైతం ఈ అక్రమ రిపేర్ల స్కామ్, డీజిల్ దందాలో ‘నెలవారీ మామూళ్లు’ అందుతుండటం వల్లే విజిలెన్స్ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కవాడిగూడ వర్క్‌షాప్‌లో ఫోర్‌మెన్ ఫారూక్ నకిలీ కూపన్లతో డీజిల్ అమ్ముకుంటూ మున్సిపల్ ఖజానాకు భారీగా గండి. తప్పుడు రిపేర్ బిల్లులతో కోట్లు కొల్లగొడుతున్న ఫారూక్ అవినీతిపై తక్షణమే విజిలెన్స్, ఏసీబీ (ACB) ఎంక్వయిరీకి ఉన్నతాధికారులు ఆదేశించాలి. 

ట్రై కార్పొరేషన్ స్పెషల్ అధికారి జయేష్ రంజన్ ఐఏఎస్ ఈ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మున్సిపల్ శాఖ మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఈ దోపిడీపై దృష్టి సారించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.WhatsApp Image 2026-06-16 at 21.06.48

*‘ఫోరమ్ ఫర్ యాంటీ కరప్షన్’ ప్రధాన డిమాండ్లు:
 * ఈ వ్యవహారంపై ప్రత్యేక ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి.
 * స్టేట్ విజిలెన్స్ మరియు అవినీతి నిరోధక శాఖ (ACB) కు ఈ ఆధారాలను అప్పగించి సమగ్ర విచారణ జరిపించాలి.
 * నకిలీ కూపన్లు సృష్టించిన ఫోర్‌మెన్ ఫారూక్‌పై, అతనికి సహకరించిన ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
 * లూటీ చేసిన ప్రజాధనాన్ని బాధ్యుల నుంచి పైసా పైసాతో సహా రికవరీ చేయాలి.WhatsApp Image 2026-06-16 at 20.50.29WhatsApp Image 2026-06-16 at 20.50.28 (1)WhatsApp Image 2026-06-16 at 20.50.28WhatsApp Image 2026-06-16 at 20.50.27

About The Author