ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన పెయింటింగ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు

సంగారెడ్డి :
:
సదాశివపేట మున్సిపాలిటీ నూతన పెయింటింగ్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ అసోసియేషన్ సర్టిఫికెట్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా సభ్యులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యూనియన్ ఏర్పాటు పై శుభాకాంక్షలు తెలిపారు. పెయింటింగ్ రంగంలో ఎదురయ్యే సమస్యలను ఇబ్బందులను పరిష్కరించేందుకు అండగా ఉంటానని, ప్రభుత్వం నుంచి లభించాల్సిన సబ్సిడీలను అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం యూనియన్ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఆఫీసలి మహమూద్ ఉపాధ్యక్షుడు యూసఫ్ అలీ మహమ్మద్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతా సాయినాథ్ పట్టణ అధ్యక్షుడు మల్లన్న కలీం పటేల్ సామి నాగేష్ తమిళ్ పెయింటింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
