తీన్మార్ మల్లన్న శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలి: రెడ్డి సంఘాల నాయకులు
కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): శాసన మండలి సభ్యుడు చింతపండు నవీన్ ( తీన్మార్ మల్లన్న) రాష్ట్రం లోని అగ్ర కులాలను, రెడ్డి కులాన్ని అసభ్య పదజాలం తో దూషించడాన్ని తీవ్రం గా ఖండిస్తూ ఆయన వెంటనే శాసనమండలి నుండి తొలగించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలి ఛైర్మన్ తో ఆయన నివాసంలో రెడ్డి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, జాతి ఐక్యతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న మల్లన్న పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరగా స్పందించిన ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, చట్ట ప్రకారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు .మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ వెంటనే తీన్మార్ మల్లన్న రెడ్డి సమాజానికి క్షమాపణలు చెప్పాలని, ఇలాంటి వ్యక్తి పైన ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని లేని యెడల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రెడ్డి ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి మల్లన్న పై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలని లేని ఎడల రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సహా అధ్యక్షులు భుంపల్లి.రాఘవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల.శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ దారం.జగన్నాథ్ రెడ్డి, ఈ సి మెంబర్ న్యాలకొండ.ప్రసన్న రెడ్డి, ఐక్య వేదిక జిల్లా కో ఆర్డినేటర్ కొస్న.వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోటు.మల్లారెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి):
శాసన మండలి సభ్యుడు చింతపండు నవీన్ ( తీన్మార్ మల్లన్న) రాష్ట్రం లోని అగ్ర కులాలను, రెడ్డి కులాన్ని అసభ్య పదజాలం తో దూషించడాన్ని తీవ్రం గా ఖండిస్తూ ఆయన వెంటనే శాసనమండలి నుండి తొలగించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా మండలి ఛైర్మన్ తో ఆయన నివాసంలో రెడ్డి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతూ, జాతి ఐక్యతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న మల్లన్న పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరగా స్పందించిన ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, చట్ట ప్రకారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం నాయకులు .మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ వెంటనే తీన్మార్ మల్లన్న రెడ్డి సమాజానికి క్షమాపణలు చెప్పాలని, ఇలాంటి వ్యక్తి పైన ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని లేని యెడల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రెడ్డి ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి మల్లన్న పై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలని లేని ఎడల రెడ్డి సామాజిక వర్గం నుండి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సహా అధ్యక్షులు భుంపల్లి.రాఘవరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల.శ్రీనివాస్ రెడ్డి, ఆర్బీవీఆర్ఆర్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, జిల్లా జాయింట్ సెక్రటరీ దారం.జగన్నాథ్ రెడ్డి, ఈ సి మెంబర్ న్యాలకొండ.ప్రసన్న రెడ్డి, ఐక్య వేదిక జిల్లా కో ఆర్డినేటర్ కొస్న.వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోటు.మల్లారెడ్డి, రెడ్డి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
