
ములుగు జిల్లా :
ములుగు మండలం జాకారం గ్రామ సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో నేడు జరగనున్న 11వ జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు హాజరవుతున్నట్లు ములుగు డిసిఒ డాక్టర్ ఏ.వెంకటేశ్వర్లు తెలిపారు.
బుధవారం గురుకులంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి కృష్ణ ఆదిత్య 2025 _ 2026 సంవత్సరానికి గాను ఆదేశాలు జారీ చేయగా, కాలేశ్వరం జోన్ నుంచి జిల్లాల నుండి మొత్తం 11 విద్యాసంస్థలు తరుపున 85 మంది చొప్పున అండర్ 14 అండర్ 17 అండర్ 19 మొత్తం దాదాపుగా 935 మంది విద్యార్థులు వరుసగా మూడు రోజులు ఆడనున్నారన్నారు. సెక్రటరీ ఆదేశాల మేరకు అన్ని వసతుల ఏర్పాట్లతో పాటు, క్రీడలకు కావలసిన స్థలం కేటాయించడం జరిగిందని, నేటి క్రీడల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, రెవెన్యూ, పౌర సంబంధాల సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మంత్రులతో పాటు ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్,ఎస్పీ శబరిష్ హాజరవుతారని తెలిపారు.. ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యమైన ప్రత్యేకమైన భోజనం అందించడం జరుగుతుందనీ, అదేవిధంగా మంచి వసతులు కల్పించబడతాయన్నారు. మూడు రోజులపాటు మెడికల్ క్యాంపు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాకారం గురుకులం పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి జిల్లా డిసిఓ గోల్కొండ బిక్షపతి , క్రీడల ఇంచార్జి పీడీ వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ పిచ్చిరెడ్డి, అధ్యాపక బృందం ఆర్ వెంకటేశ్వర్లు,సురేష్ బాబు ప్రభాకర్ శ్రీను సుధాకర్ ఉపాధ్యాయులు యాదగిరి రామచంద్రం బ్రహ్మచారి రజిని మమత సదయ్య దయానంద్ ముఖేష్ పిటి చంద్రమౌళి పుల్లయ్య తదితర బృందం పాల్గొన్నారు.