శబరిమల యాత్ర దిగ్విజయం కావాలి
- జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి
- రాము స్వామి ఆధ్వర్యంలో పాదయాత్రగా సంగారెడ్డి నుంచి శబరిమలకు అయ్యప్ప స్వాములు

సంగారెడ్డి :
:
సంగారెడ్డి పట్టణం నుంచి తిరుపతి, కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమలకు పాదయాత్రగా వెళ్తున్న రాము గురుస్వామి ఆధ్వర్యంలోని స్వాముల బృందాన్ని గురువారం తమిళనాడు వేద సందూర్ వద్ద జ్యోతిర్వాస్తు విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి కలిశారు. ఈ సందర్భంగా స్వాముల బృందం మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆశీస్సులు అందుకున్నారు. కాలినడకన దైవాన్ని దర్శిస్తే దాన్ని తీర్థయాత్ర అంటారని సిద్ధాంతి తెలిపారు. ఇప్పటివరకు 1250 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినట్లు రాము గురు స్వామి సిద్ధాంతికి వివరించారు. కటోర దీక్షలతో చేపట్టిన పాదయాత్ర సుఖప్రదంగా జరగాలని సిద్ధాంతి ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. మరో 250 కిలోమీటర్లతో శబరిమల యాత్ర పూర్తి అవుతుందని స్వాములు పేర్కొన్నారు. క్షేమదాయకంగా యాత్రను పూర్తి చేసుకొని సంగారెడ్డి పట్టణానికి స్వాముల బృందం చేరుకోవాలని సిద్ధాంతి ఆశీర్వచనాలు అందజేశారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
