సామినేని హంతకుల అరెస్టు చేయాలి..
డీజీపీకి సీపీఐ (ఎం) రాష్ట్ర నాయకుల వినతి
రాజకీయ కక్ష్యలతోనే హత్య
ఘటన జరిగి 12 రోజులైనా కేసును ఛేదించటంలో నిర్లక్ష్యం

ఖమ్మం ప్రతినిది :
Read More నేటి భారతం :
రామారావు బతికి ఉంటే సీపీఐ (ఎం)ను ఓడించటం సాధ్యం కాదని భావించి రాజకీయ కక్షలతోనే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని హత్య చేశారని ఆరోపించారు. హంతకులను నేను స్వయంగా చూశాను.. అని వారి పేర్లతో సహా రామారావు భార్య స్వరాజ్యం పోలీసులకు పిటిషన్ ఇచ్చినా ఇప్పటివరకు నిందితులను అరెస్టు చేయకపోవటాన్ని తప్పు పట్టారు. రామారావు నిస్వార్ధ నాయకుడు, వారి స్వగ్రామానికి రెండుసార్లు ఆయన ఏకగ్రీవ సర్పంచిగా ఎన్నికయ్యారని తెలిపారు. రామారావు సతీమణి ఒకసారి గ్రామ సర్పంచ్ గా పనిచేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలోని పేదలకు తమ సొంత భూమిని ఇండ్ల స్థలాల కోసం పంచిన చరిత్ర రామారావు కుటుంబానికి ఉందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శిగా రామారావు సేవలు అందించారని, సీపీఐ (ఎం)లో దాదాపు 50 ఏళ్లుగా కొనసాగుతున్నారని వివరించారు. గత కొంతకాలంగా తన స్వగ్రామం పాతర్లపాడు లో ఉంటూ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు తెలిపారు. ఇది సహించలేని కాంగ్రెస్ నాయకులు ఆయన ఉంటే రాజకీయంగా తమ మనుగడ సాగదని భావించి, కుట్ర చేసి హత్య చేశారని ఆరోపించారు. ఈ హత్యకు కారణమైన వారందరినీ అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం అందజేశారు.
About The Author
06 Dec 2025
