ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం..


1000002870ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో (భారత శక్తి)జూలై 29: నిర్మల్ జిల్లా కుభీర్  మండలంలోని దార్ కుబీర్ గ్రామంలో పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు. ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.రూ.52.20 లక్షలతో  మన ఊరు-మన బడి  పథకంలో నూతనంగా నిర్మించిన పాఠశాలను ఎమ్మెల్యే  ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువే విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందించాలని,ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే సూచించారు. సకల సౌకర్యాలు కలిగిన ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రయోజకులై ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. నాగుల పంచమి పురస్కరించుకొని పాఠశాల  విద్యార్థినులు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. 
 
 
 
 
 
 

About The Author