కొత్త కార్డులు ఏమో కాని ఉన్న కార్డులను రద్దు చేసిన గత బిఅర్ఎస్ ప్రభుత్వం...

విమర్శలు చేసిన కప్పాటి పాండురంగా రెడ్డి.


1000002809హైదరాబాద్ జూలై 29 (భారతశక్తి): మంగళవారం మండల కేంద్రములో నిర్వహించిన  విలేఖరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి, అందుగుల సత్యనారాయణ, కందుకూరు మండలం ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు మూల హనుమంత్ రెడ్డి, మండల ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షులు సభావత్ గణేష్ నాయక్, ఎగ్గడి కృష్ణ, వుండెల బాబురావు, గోపిరెడ్డి సత్యనారాయణరెడ్డి, గూడూరు మధుకర్ రెడ్డి, మహేందర్ కుర్మా సుధాకర్ రెడ్డ,దుర్గ ప్రసాద్ లు పాల్గొని మాట్లాడారు..

బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందిని గత పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇయ్యక పోగా 10 లక్షలకు పైగా పాత కార్డులు రద్దు చేసి, పేదలకు తీవ్ర అన్యాయం చేసి నిసిగ్గుగా నేడు బిఅర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరు లక్షలకు పైగా నూతన రేషన్ కార్డులు ఇచ్చామంటూ చిలుక పలుకులు పలుకుతాన్నారని అన్నారు. గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం అందిన కాడికి దోచుకుందని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు.

నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఒకే సారి 5 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తూ, నూతన రేషన్ కార్డుల మంజూరు నిరంతర పక్రియగా కొనసాగించాలని  ప్రజా ప్రభుత్వం నిర్మాయించిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని,ప్రతి పేద కుటుంబానికి చేయూతనందిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. 
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి పథకాలను మంజూరు చేస్తున్నామని  అన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వారు అన్నారు. 
 
 
 
 
 
 

About The Author