30 ఏళ్ల పోరాటంతోనే మాదిగల మాదిగ ఉపకులాల పోరాటం ఫలించింది: ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కవ్వంపెల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి): మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణకు కాషాయ రంగు పులుమితున్నారని మనకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపెళ్లి సత్యనారయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రజా పాలన ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో అంబేద్కర్ చౌరస్తా నుండి జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి అరుణ్, లింగంపల్లి బాబులతో కలిసి అంబేద్కర్ , జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగల పాలిట దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, వర్గీకరణ చేసిన సందర్భంగా డప్పు వాయిద్యాలతో ర్యాలీగా తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటానికి తెరదించుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపాయన్నారు. ఎన్నో పోరాటాలు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందనీ , వర్గీకరణ వల్ల ఎవరి వాటా ఎంతో అని చేవెళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున కర్గే వాగ్దానం చేయడం జరిగిందన్నారు. మందకృష్ణ మాదిగ కాషాయం పార్టీ వైపు నడుస్తున్నాడని, దీనికి ముందే తెరదించుతూ వర్గీకరణ చేయడం జరిగిందని చెప్పారు. కొద్దిమంది రిజర్వేషన్ 11 శాతం పెంచితే బాగుండేది అంటున్నారనీ, మళ్లీ 2026 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం మా పార్టీ మా దైవమైన రేవంత్ రెడ్డి మళ్ళీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్ నాయక్, కల్వల రామచందర్, సముద్రాల అజయ్, జీడి రమేష్, పోతారపు సురేందర్, దీకొండ శేఖర్ ,హస్తపురం రమేష్, మారంపల్లి లక్ష్మీనారాయణ, గాలి అనిల్ కుమార్, హస్త పురం తిరుమల ,కాంపల్లి కీర్తి కుమార్, అహమ్మద్ అలీ ,గజ్జల ఆనంద్, కుర్ర పోచయ్య, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ,పులి ఆంజనేయులు గౌడ్ ,విక్టర్, రాచకొండ ప్రభాకర్ ,సలీముద్దీన్, మొరంపల్లి రమణారెడ్డి, సిరిపురం నాగప్రసాద్ ,షబానా మహమ్మద్, హనీఫ్, జ్యోతి రెడ్డి, పెద్ది గారి తిరుపతి ,బోనాల మురళి, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

30 ఏళ్ల పోరాటంతోనే మాదిగల మాదిగ ఉపకులాల పోరాటం ఫలించింది: ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు కవ్వంపెల్లి

కరీంనగర్, ఫిబ్రవరి 6(భారత శక్తి):
మంద కృష్ణ మాదిగ ఎస్సి వర్గీకరణకు కాషాయ రంగు పులుమితున్నారని మనకొండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపెళ్లి సత్యనారయణ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కాంగ్రెస్ ప్రజా పాలన ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా, నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో అంబేద్కర్ చౌరస్తా నుండి జగ్జీవన్ రామ్ చౌరస్తా వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం గారు, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి అరుణ్, లింగంపల్లి బాబులతో కలిసి అంబేద్కర్ , జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిచారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మాదిగల పాలిట దేవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, వర్గీకరణ చేసిన సందర్భంగా డప్పు వాయిద్యాలతో ర్యాలీగా తరలిరావడం సంతోషంగా ఉందన్నారు. 30 ఏళ్ల వర్గీకరణ పోరాటానికి తెరదించుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని వర్గాలు మద్దతు తెలిపాయన్నారు.
ఎన్నో పోరాటాలు కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందనీ , వర్గీకరణ వల్ల ఎవరి వాటా ఎంతో అని చేవెళ్ల ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున కర్గే వాగ్దానం చేయడం జరిగిందన్నారు.
మందకృష్ణ మాదిగ కాషాయం పార్టీ వైపు నడుస్తున్నాడని, దీనికి ముందే తెరదించుతూ వర్గీకరణ చేయడం జరిగిందని చెప్పారు. కొద్దిమంది రిజర్వేషన్ 11 శాతం పెంచితే బాగుండేది అంటున్నారనీ, మళ్లీ 2026 సంవత్సరంలో జనాభా లెక్కల ప్రకారం మా పార్టీ మా దైవమైన రేవంత్ రెడ్డి మళ్ళీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతామని హామీ ఇచ్చారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నాయకులు శ్రావణ్ నాయక్, కల్వల రామచందర్, సముద్రాల అజయ్, జీడి రమేష్, పోతారపు సురేందర్, దీకొండ శేఖర్ ,హస్తపురం రమేష్, మారంపల్లి లక్ష్మీనారాయణ, గాలి అనిల్ కుమార్, హస్త పురం తిరుమల ,కాంపల్లి కీర్తి కుమార్, అహమ్మద్ అలీ ,గజ్జల ఆనంద్, కుర్ర పోచయ్య, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ,పులి ఆంజనేయులు గౌడ్ ,విక్టర్, రాచకొండ ప్రభాకర్ ,సలీముద్దీన్, మొరంపల్లి రమణారెడ్డి, సిరిపురం నాగప్రసాద్ ,షబానా మహమ్మద్, హనీఫ్, జ్యోతి రెడ్డి, పెద్ది గారి తిరుపతి ,బోనాల మురళి, విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.

About The Author