గద్దర్ పై కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ వాఖ్యలను బాధకరం: మాజీ మేయర్ సర్ధార్

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి): పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. గద్దర్ పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో తన జీవితాన్ని ఫణంగా పెట్టి చేయలేదన్నారు.తెలంగాణ, తాడిత,పీడిత, పేద ప్రజల, అణగారిన వర్గాలు, మహిళల కోసం గద్దర్ పోరాడారని చెప్పారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. గద్దర్ పై విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెయడం వంటిదని, గద్దర్ ఓ చారిత్రాత్మక వ్యక్తి..యుగ పురుషుడని కొనియాడారు. ప్రజల పాటగా చిరస్మరణీయుడని, స్థాయిని అవార్డులు నిర్ణయించలేవన్నారు. స్వయంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని ఉద్దేశించి చాలా గొప్పగా వర్ణించి ఉత్తరాన్ని రాసిన సంగతి కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ కి గుర్తు లేదాని ప్రశ్నించారు .కేవలం సంచలనాలను సృష్టించాలని ఉద్దేశంతో రాష్ట్ర సాధన కోసం గేయలతో తన ప్రాణాన్ని అర్పించిన యుద్ధ నౌక గద్దర్ పై ఆలోచించకుండా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు . ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గొప్పగా చెబితే… కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ విమర్శిస్తున్నారని .. నరేంద్ర మోడీ పై మీకు వ్యతిరేకత ఉందా … లేక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రాసిన లేఖ ఫోర్జరీ అంటారా … దీని పై వెంటనే కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ స్పందించాలని అన్నారు.

గద్దర్ పై కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ వాఖ్యలను బాధకరం: మాజీ మేయర్ సర్ధార్

కరీంనగర్, జనవరి 30(భారత శక్తి):
పద్మ అవార్డు ఎంపిక నేపథ్యంలో గద్దర్ పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మేయర్ , రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సర్ధార్ రవీందర్ సింగ్ తీవ్రంగా ఖండించారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడారు. గద్దర్ పదవుల కోసమో, డబ్బు కోసమో, అవార్డుల కోసమో తన జీవితాన్ని ఫణంగా పెట్టి చేయలేదన్నారు.తెలంగాణ, తాడిత,పీడిత, పేద ప్రజల, అణగారిన వర్గాలు, మహిళల కోసం గద్దర్ పోరాడారని చెప్పారు. శరీరంలో బుల్లెట్లు ఉంచుకొని ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. గద్దర్ పై విమర్శలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మెయడం వంటిదని, గద్దర్ ఓ చారిత్రాత్మక వ్యక్తి..యుగ పురుషుడని కొనియాడారు. ప్రజల పాటగా చిరస్మరణీయుడని, స్థాయిని అవార్డులు నిర్ణయించలేవన్నారు. స్వయంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ
ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని ఉద్దేశించి చాలా గొప్పగా వర్ణించి ఉత్తరాన్ని రాసిన సంగతి కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ కి గుర్తు లేదాని ప్రశ్నించారు .కేవలం సంచలనాలను సృష్టించాలని ఉద్దేశంతో రాష్ట్ర సాధన కోసం గేయలతో తన ప్రాణాన్ని అర్పించిన యుద్ధ నౌక గద్దర్ పై ఆలోచించకుండా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు .
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గొప్పగా చెబితే… కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ విమర్శిస్తున్నారని .. నరేంద్ర మోడీ పై మీకు వ్యతిరేకత ఉందా … లేక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రాసిన లేఖ ఫోర్జరీ అంటారా …
దీని పై వెంటనే కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ స్పందించాలని అన్నారు.

About The Author