మానేరులో వైభవంగా వసంత పంచమి వేడుకలు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి): మానేరు విద్యాసంస్థలలో సోమవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. చదువుల తల్లి, జ్ఞాన దేవత శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజను విద్యాసంస్థలలో కన్నుల పండువగా జరిగాయి. ముందుగా అమ్మవారికి మహా సరస్వతి పూజ దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను వేదపండితుల సమక్షంలో చేపట్టారు.. పాఠశాలలోనీ విద్యార్థులచే మానేరు విద్యాసంస్థల అధినేత కడారి సునీతా అనంతరెడ్డి దంపతులు అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు లక్ష్య సిద్దితో చదివి ఉన్నతంగా ఎదుగాలని ఆశీర్వదించారు. విద్యలో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి వసంత పంచమి రోజునే జన్మించిందని, ప్రతి ఒక్కరు సరస్వతి అమ్మవారిని పూజించాలన్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మానేరులో వైభవంగా వసంత పంచమి వేడుకలు

కరీంనగర్, ఫిబ్రవరి 3(భారత శక్తి):
మానేరు విద్యాసంస్థలలో సోమవారం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలను పురస్కరించుకొని పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. చదువుల తల్లి, జ్ఞాన దేవత శ్రీ మహాసరస్వతి అమ్మవారి పూజను విద్యాసంస్థలలో కన్నుల పండువగా జరిగాయి. ముందుగా అమ్మవారికి మహా సరస్వతి పూజ దేవి పూజ, అభిషేకం, కుంకుమార్చన కార్యక్రమాలను వేదపండితుల సమక్షంలో చేపట్టారు.. పాఠశాలలోనీ విద్యార్థులచే మానేరు విద్యాసంస్థల అధినేత కడారి సునీతా అనంతరెడ్డి దంపతులు అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్బంగా అనంతరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు లక్ష్య సిద్దితో చదివి ఉన్నతంగా ఎదుగాలని ఆశీర్వదించారు. విద్యలో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. చదువుల తల్లి సరస్వతి దేవి వసంత పంచమి రోజునే జన్మించిందని, ప్రతి ఒక్కరు సరస్వతి అమ్మవారిని పూజించాలన్నారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

About The Author