రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు, సీసీ కెమెరాల ఏర్పాటు.

ఏసీపీ లక్ష్మీనారాయణ

1000482601షాద్నగర్, భారత శక్తి ప్రతినిధి, ఆగస్టు 14: రాయికల్ గ్రామంలో ఇటీవల వరుసగా జరిగిన దొంగతనాల ఘటనలతో గ్రామ ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి ఎల్లప్పుడూ అండగా నిలిచే గ్రామ నివాసి శ్రీ రాయికల్ శ్రీనివాస్  స్వయంగా రూ. 2,00,000/- వ్యయంతో గ్రామమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, సీఐ విజయ్‌కుమార్  విచ్చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ "హైవే పక్కన ఉన్న రాయికల్ గ్రామం ఎల్లప్పుడూ రద్దీగా ఉండడం వల్ల భద్రతా చర్యలు అత్యవసరం. సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో, నేరస్థులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తాయి" అని పేర్కొన్నారు.
IMG-20250814-WA0037 (1)
గ్రామ ప్రజల తరపున, గ్రామ భద్రత కోసం విశేషంగా సహకరించిన రాయికల్ శ్రీనివాస్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్, మాజీ సర్పంచ్ దిద్దుల కృష్ణయ్య, మాజీ సర్పంచ్ పాండు నాయక్, మహిళా సంఘం నాయకురాలు యశోదమ్మ మరియు వాళ్ళ బృందం,  ఎర్రోళ్ల యాదయ్య , మహమ్మద్ సమద్, వార్డు మెంబర్ మెకానిక్ శంకరయ్య, ఒళ్ళు శేఖర్ రెడ్డి, కుమ్మరి జంగయ్య, దారమోని వెంకటయ్య, నూకల రామచంద్రయ్య, పాండు గౌడ్, బాసుపల్లి యాదయ్య, బ్యాగరి యాదగిరి, బ్యాగరి చిన్నయ్య, మాసగళ్ల చెన్నయ్య, బంగ్లకాడి శ్రీనివాస్, గడ్డపు కృష్ణయ్య,  డీజే వేణు, బాలు, ప్రశాంత్, సందీప్, అభి, కారోబర్ యాదయ్య, పాషా, బాసుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు

About The Author