(భారత శక్తి ప్రతినిధి) కామారెడ్డి, ఆగస్టు 14: తేదీ 14.08.2025 నా ఉదయం 8:00 గంటలకు టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు బేకరీ, హోటల్లలో తనిఖీలు నిర్వహించిన జిల్లా పౌర సరపరాల అధికారి కామారెడ్డి మల్లి ఖార్జున బాబు ఆదేశాల ప్రకారం జిల్లా కేంద్రంలో గృహ సంబంధ గ్యాస్ సింలిండర్ లను వాణిజ్య అవసరాలకు వాడుతున్నారనే సమాచారం మేరకు జిల్లా సహాయ పౌర సరఫరాల అధికారి కామారెడ్డి అధ్వర్యంలో రెండు టీమ్ లు జిల్లా కేంద్రంలో పలు టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు బేకరీ, హోటల్లలో తనిఖిలు నిర్వహించి అక్రమంగా గృహ సంబంధ గ్యాస్ సింలిండర్ లను వాణిజ్య అవసరాలకు వాడుతున్న కారణంగా 53 గృహ సంబంధ గ్యాస్ సింలిండర్ లను జప్తు చేయడం జరగింది, నిర్వహకుల పై 6-ఎ కేసులు ఎల్ పి జి కంట్రోల్ ఆర్డర్, 2000 క్రింద నమెదు చేయడం జరగింది. గృహ సంబంధ గ్యాస్ సింలిండర్ లను వాణిజ్య అవసరాలకు వాడకూడదని కచ్చితంగా వాణిజ్య సింలిండర్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకోబడును.
ఈ తనిఖిలో జిల్లా సహాయ పౌర సరపరాల అధికారి స్వామి, డిటి (సిఎస్) లు సురేశ్, కిష్టయ్య, ఖలీద్, ఖాజా శరీఫ్, తిరుపతి లు పాల్గొన్నారు