భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు:పోలీస్ కమిషనర్ సునీల్ దత్.. 

 

 

WhatsApp Image 2025-08-13 at 6.16.10 PM

ఖమ్మం ప్రతినిది : జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

Read More జింక మాంసం పట్టుకున్న అటవీ విశాఖ అధికారులు.

బుధవారం నగరంలోని కాల్వవోడ్డు మున్నేరు, ప్రకాష్ నగర్ మున్నేరు ప్రాంతాలను మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య తో కలసి పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలెవరు రోడ్డు దాటే ప్రయత్నం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.మరో మూడు రోజులు ఇదే పరిస్థితులు వుండే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనదారులు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని, పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా చేపాల వేటాకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని పెర్కొన్నారు. యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో డయల్‌ 100కు, స్ధానిక పోలీసులకు, పోలీస్ కంట్రోల్ సెల్ నెంబర్  8712659111, కలెక్టర్ ఆఫీస్  టోల్ ఫ్రీ నెంబర్ 1077, సెల్ నెంబరు 9063211298 సమాచారం ఆందిచాలని సూచించారు. ఇప్పటికే చెరువులు, వాగుల వద్ద పోలీస్ పెట్రోలింగ్‌ పెంచి ప్రమాద హెచ్చరికలను తెలియజేసేలా పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనలు, చప్టలపై బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాల భారీన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని పోలీస్ అధికారులకు  సూచించామని తెలిపారు.

Read More కేరళ మోడల్ పాఠశాలలో ఉత్సాహంగా కృష్ణాష్టమి వేడుకలు

ఎగువ ప్రాంతంలో అధిక వర్షాల మూలంగా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ దష్ట్యా  అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రజలు కూడా అపప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని  సూచించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ మోహన్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read More ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలి..

About The Author