మాదకద్రవ్యాల ప్రమాదాలపై భైంసాలో అవగాహన సదస్సు..
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యూరో,(భారత శక్తి) ఆగస్ట్ 13: యువతలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు, నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో, మంగళవారం ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా వైట్ టీ-షర్ట్ క్లబ్ ఆధ్వర్యంలో, నిర్మల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు షేక్ నోమన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా భైంసా అసిస్టెంట్ ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం వల్ల కాలేయం, గుండె మరియు మెదడుపై తీవ్ర ప్రభావాలు పడతాయి, దీని వల్ల నిరాశ, మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, అని చెప్పారు. అలాగే గంజాయి, సత్తా, మట్కా వంటి అక్రమ కార్యకలాపాలపై, భైంసా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారని, అనుమానాస్పద ఘటనలను వెంటనే పోలీసులకు తెలపాలని ప్రజలను కోరారు.