వర్షాభావ ప్రాంతాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

img-20250814-wa0081మీర్ పేట్, ఆగష్టు 14 (భారత శక్తి):మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జలపల్లి మున్సిపాలిటీ కమిషనర్లకు స్వయంగా ఫోన్ చేసి, ఆయా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులపై ఆరా తీసిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పసిపిల్లలు అవసరం లేనప్పుడు ఇంటి బయటకు రాకూడదని సూచించారు. విద్యుత్ స్తంభాలు, పాడుబడ్డ ఎలక్ట్రిక్ వైర్లకు దూరంగా ఉండాలని, పాడు పడ్డ ఇళ్లలో నివసించరాదని, మ్యాన్‌హోల్ మూతలు తీయరాదని ప్రజలకు పిలుపునిచ్చారు.

About The Author